Begin typing your search above and press return to search.

ఐదేళ్లు.. పార్టీ అఖిలేష్ దేన‌ని తేల్చేశారు

By:  Tupaki Desk   |   5 Oct 2017 9:52 AM GMT
ఐదేళ్లు.. పార్టీ అఖిలేష్ దేన‌ని తేల్చేశారు
X
జాతీయ రాజ‌కీయాల్లో ఒక చ‌క్రం తిప్పిన ములాయం సింగ్ యాద‌వ్ శ‌కం ముగిసిన‌ట్లేనా? అంటే.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చూస్తే అవున‌ని చెప్క త‌ప్ప‌దు. స‌మాజ్ వాదీ పార్టీ సింపుల్ గా ఎస్పీకి జాతీయ అధ్య‌క్షుడిగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌ ను ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లుగా ఆ పార్టీ సీనియ‌ర్ నేత రాంగోపాల్ యాద‌వ్ పేర్కొన్నారు. ఆగ్రాలో జ‌రిగిన ఎస్పీ జాతీయ స‌ద‌స్సులో అధినేత ఎన్నిక జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా అఖిలేష్ ను ఐదేళ్లు జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. వాస్త‌వానికి ఎస్పీ పార్టీ అధ్య‌క్షుడి ప‌ద‌వీ కాలం మూడేళ్లు మాత్ర‌మే. తాజాగా ఐదేళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మార్పును అఖిలేష్ తో షురూ చేయ‌నున్నారు. అయితే.. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. 2022లో జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పార్టీకి అఖిలేష్ నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని వెల్ల‌డించారు. ఇంత పెద్ద మార్పు జ‌రుగుతున్నా పార్టీకి సుదీర్ఘ‌కాలంగా జాతీయ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన ములాయం సింగ్ యాద‌వ్ మాత్రం హాజ‌రు కాలేదు.

కొన్ని నెల‌ల క్రితం ముగిసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు స‌మాజ్ వాదీ పార్టీలో అంత‌ర్గ‌త సంక్షోభం నెల‌కొన‌టం.. ఆ సంద‌ర్భంగా ములాయంను పార్టీ అధ్య‌క్ష హోదాలో నుంచి తీసేసి అఖిలేష్ ను ఎంపిక చేశారు. దీనిపై తండ్రికొడుకుల మ‌ధ్య ర‌చ్చ జ‌రిగింది. అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ములాయం దూరంగా ఉంటున్నారు.

తాజా స‌మావేశానికి తండ్రిని అఖిలేష్ స్వ‌యంగా పిలిచిన‌ప్ప‌టికీ ములాయం రాలేదు. నేతాజీ స‌మావేశానికి రాలేద‌న్న ప్ర‌శ్న‌కు బదులిచ్చిన అఖిలేష్‌.. త‌న‌తో ఫోన్లో మాట్లాడార‌ని.. త‌న‌ను అశీర్వ‌దించి.. అభినందించిన‌ట్లుగా చెప్పారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా శివ‌పాల్ యాద‌వ్ కూడా త‌న‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన‌ట్లుగా వెల్ల‌డించారు. ప‌వ‌ర్ చేతిలో లేన‌ప్పుడు బాధ్య‌త తీసుకుంటానంటే ఎవ‌రు మాత్రం కాదంటారు చెప్పండి.