Begin typing your search above and press return to search.

ములాయంపై కోపాన్ని మంత్రులపై చూపించాడు

By:  Tupaki Desk   |   29 Oct 2015 10:43 AM GMT
ములాయంపై కోపాన్ని మంత్రులపై చూపించాడు
X
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ నుంచి ఒకేసారి 8 మంది మంత్రులను తప్పించారు. వారిలో అయిదుగురు కేబినెట్ మంత్రులు కాగాముగ్గురు సహాయ మంత్రులు. ఒకేసారి ఇలా 8మంది మంత్రులను తప్పించడం సంచలనంగా మారింది. అయితే.... అఖిలేశ్ కు వారిని తొలగించాలన్న ఆలోచన లేదని... తన తంఢ్రి ములాయంపై కోపంతో ఆయన ఇంత సీరియస్ గా వ్యవహరించారని చెబుతున్నారు.

యూపీ కేబినెట్ నుంచి తొలగింపునకు గురైన మంత్రులు పనితీరు సక్రమంగా లేదని సమాజ్ వాది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పనితీరు లోపాలు - అవినీతి ఆరోపణల వల్లే వారిపై వేటు పడిందని చెబుతున్నారు. కానీ... కారణం అది కాదని... అఖిలేశ్ తీవ్ర ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అఖిలేశ్ పాలన బాగులేదంటూ ఆయన తండ్రి - ఎస్పీ అధినేత ములాయం తరచూ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మళ్లీ ఆయన కుమారుడిని పిలిచి క్లాస్ పీకడమే కాకుండా బహిరంగంగానూ విమర్శలు చేశారు. దీంతో ఇంకా తనను చేయిపట్టుకుని నడిపిస్తున్నారన్న అసంతృప్తి.... అనవసర జోక్యంతో తన పరువు తీస్తున్నారన్న ఆగ్రహించిన అఖిలేశ్ తీవ్ర నిర్ణయం తీసుకుని పార్టీలో ఒక్కసారిగా కుదుపు తెచ్చి తండ్రిని భయపెట్టాలని భావించే ఇలా చేశారని అంటున్నారు.

మొత్తానికి తండ్రీకొడుకుల గొడవలో 8 మంది మంత్రులకు పాపం పదవులు పోయాయి. దీంతో వారు తమను తొలగించిన అఖిలేశ్ ను కాకుండా ములాయంనే తిడుతున్నారట. అసలు అఖిలేశ్ లక్ష్యం కూడా అదే అని చెబుతున్నారు. తండ్రి జోక్యాన్ని తగ్గించాలంటే ఆయనపై పార్టీలో అసంతృప్తి పెంచాలన్న వ్యూహంతోనే అఖిలేశ్ ఈ స్టెప్ వేసినట్లు చెబుతున్నారు.