Begin typing your search above and press return to search.
అఖిలేష్ సంచలన ప్రకటనః ఆమెతో పొత్తు
By: Tupaki Desk | 9 March 2017 5:47 PM GMTరాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండారనేందుకు ఎందరో నేతలు ఉదాహరణగా నిలుస్తారు. బీహార్‌లో ఉప్పునిప్పులుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్ ఊహించని రీతిలో గత ఏడాదిలో ఎన్నికల ముందుకు చేయి కలిపారు. ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి ఉమ్మండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలాంటి సీనే ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపించే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ముందు కాకుండా ఫలితాలు వెలువడిన తర్వాత ఈ పరిస్థితి రావచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎస్పీ రథసారథి అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనం.
ఐదు రాష్ర్టాల ఎన్నికలపై వివిధ చానల్స్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు అవసరమైతే తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సమాజ్ వాదీ పార్టీ నేత, తన భర్త అఖిలేష్ యాదవ్ బాధ్యతలు చేపడతారని డింపుల్ యాదవ్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో డింపుల్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీకి స్టార్ కాంపెయినర్‌గా ప్రసిద్ధి చెందారు.
కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ,కాంగ్రెస్ లు కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కూటమి, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని అఖిలేష్ ప్రకటనతో తేటతెల్లమవుతోంది. ఈ ప్రకటనపై బీజేపీ నేత సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ -కాంగ్రెస్ కూటమికి మెజారిటీ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎగ్జిట్ పోల్స్‌తో నీరుగారిపోయాడని అన్నారు. మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేసిన అఖిలేష్ అత్యవసరమైతే బీఎస్‌పీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పడంతో ఆయన చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని వెల్లడయిందని సిద్ధార్థ్‌నాథ్ సింగ్ అన్నారు.