Begin typing your search above and press return to search.
మోడీని 72 ఏళ్లు బ్యాన్ చేయాలట!
By: Tupaki Desk | 30 April 2019 8:56 AM GMTపశ్చిమబెంగాల్ లో కోల్ కతా నగరానికి దగ్గర్లో ప్రధాని నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్య రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నట్లు సాక్ష్యాత్తు ప్రధాని మోడీ వ్యాఖ్యానించటంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. కీలకమైన ఎన్నికల వేళ.. ఈ తరహాలో వ్యాఖ్యలు ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అండగా నిలిచారు. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నట్లు ప్రధాని మోడీ వ్యాఖ్యానించటం సిగ్గుచేటు అని.. అనైతికంగా ఆయన అభివర్ణించారు. మోడీ మీద 72 గంటలు కాదు.. 72 ఏళ్లు నిషేధం విధించాలని ఆయన మండిపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే.. బెంగాల్ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 40 మంది పార్టీని విడిచి పెట్టి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించటం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన అఖిలేశ్.. ప్రధాని సిగ్గుమాలిన ప్రసంగం విన్నావా అని వికాస్ (అభివృద్ధి) అడుగుతోంది. దేశంలో 125 కోట్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత.. మోడీ అనైతికంగా 40 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కోసం ఆరాటపడుతున్నారు. ఆయన బ్లాక్ మని మనస్తత్వానికి ఇదో నిదర్శనం. ఆయనపై 72 గంటలు కాదు.. 72 ఏళ్లు బ్యాన్ చేయాలన్నారు.
ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన వారిని.. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన పలువురు నేతలపై 48 గంటలు.. 72 గంటలు నిషేధాన్ని విధించటం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. మోడీని 72 గంటలు కాదు.. 72 ఏళ్లు బ్యాన్ చేయాలంటూ అఖిలేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.