Begin typing your search above and press return to search.

ఉన్నావ్ ఘటన పై అసెంబ్లీ ముందు మాజీ సీఎం ధర్నా!

By:  Tupaki Desk   |   7 Dec 2019 9:57 AM GMT
ఉన్నావ్ ఘటన పై అసెంబ్లీ ముందు మాజీ సీఎం ధర్నా!
X
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు నిన్న అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉన్నావ్ కు చెందిన ఒక యువతి సంవత్సరం క్రితం అత్యాచారానికి గురైంది. అత్యాచార కేసు విచారణలో భాగంగా కోర్టుకు వెళుతున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాల పాలైన బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది.

ఈ ఘటన తో దేశం మొత్తం ఉన్నావ్ ఘటనపై అట్టుడికిపోతుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఉన్నావ్ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలను ఇప్పటికే ఉధృతం చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ గేటు దగ్గర బైఠాయించారు. ఉన్నావ్ ఘటన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉన్నావ్ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ ఉన్నావ్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఉన్నావ్ ఘటన బాధితురాలి మృతికి సీఎం సంతాపం తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఉన్నావ్ ఘటనపై విచారణకు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటన చేశారు.