Begin typing your search above and press return to search.
జడేజాను తిట్టిపోసిన అక్షర్.. రీజన్ ఏమిటంటే?
By: Tupaki Desk | 28 May 2021 7:30 AM GMTటీమిండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ .. రవీంద్రజడేజాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడివల్లే తనకు అవకాశాలు రావడం లేదంటూ తన అక్కసునంతా వెల్లబోసుకున్నాడు. జడేజా ఆల్‌రౌండర్ అయినందున అవకాశాలు ఎగరేసుకుపోతున్నాడని పేర్కొన్నాడు. అయితే అక్షర్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అక్షర్ ఆ వ్యాఖ్యలు ఫన్నీగా చేశాడో? సీరియస్ గా చేశాడో తెలియదు కానీ.. ‘నీకు అవకాశాలు రాకపోతే జడ్డూ తప్పేంటీ..ఎవరు బాగా ఆడితే వాళ్లకే అవకాశాలు వస్తాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆటలో నైపుణ్యం పెంచుకోవాలి గానీ.. తోటి క్రికెటర్ పై నోరు పారేసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అక్షర్ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్షర్ ఇంగ్లండ్ పర్యటనకు కూడా ఎంపికయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు. కాగా ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షర్ పలు విషయాలు పంచుకున్నాడు..
’ నాకు అవకాశాలు రావడం లేదంటే అందుకు కారణం నైపుణ్యాలు కాదు.. వేరే అంశాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్రజడేజా అద్భుతంగా రాణిస్తున్నారు. జడేజా బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్ లోనూ గొప్ప ప్రదర్శన ఇవ్వగలడు. అందువల్లే అతడికే అవకాశాలు వస్తాయి. నాకు ఒక్కసారి చాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటా. నాకు టీమిండియాలో పంత్ ఎంతో సన్నిహితుడు. అతడు ఆటలో ఎంతో కూల్ గా ఉంటాడు. జోకులు పేలుస్తూ ఉత్సాహ పరుస్తూ ఉంటాడు. అతడి కెప్టెన్సీలో ఆడటం చాలా కూల్‌గా ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి ఉండదు.
నా బౌలింగ్ చాలా మంది బ్యాట్స్ మన్లకు అర్థం కాదు. అందుకే తికమక పడి వికెట్లు సమర్పించుకుంటూ ఉంటారు. నా బంతి ప్రతి సారి స్పిన్ కాదు. నేను స్పిన్ వేస్తున్నానా? లేక వికెట్ టు వికెట్ వేస్తున్నానా? అనేది ప్రత్యర్థులకు అర్థం కాదు. అందుకే వికెట్లు పడుతుంటాయి. నా బౌలింగ్‌లో చాలా వైవిధ్యం ఉంటుంది. రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే వంటి సీనియర్ల దగ్గర నేను మెలకువలు నేర్చుకుంటాను’ అంటూ పలు విషయాలను పంచుకున్నాడు అక్షర్. అయితే జడ్డూ మీద చేసిన కామెంట్లు మాత్రం వివాదాస్పదం అయ్యాయి.