Begin typing your search above and press return to search.
నోట్ దిస్ పాయింట్: మోడీకి కోపమే ఉండదట!
By: Tupaki Desk | 24 April 2019 5:51 AM GMTఒక బాలీవుడ్ నటుడికి దేశ ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వటమా? ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? అంటూ సీరియస్ గా చూడక్కర్లేదు. ఎందుకంటే.. ఇలాంటి సినిమాటిక్ ఐడియాలు ప్రధాని మోడీ దగ్గర టన్నుల లెక్క ఉంటాయి. దేశ ప్రజల మనసుల్ని ఓరేంజ్లో దోచుకోవటంలో మోడీ తర్వాతే ఎవరైనా. కార్పొరేట్ స్టైల్లో తన ప్రచారాన్ని ఒకక్రమపద్దతిలో నడిపించే ఆయన.. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అక్షయ్ కుమార్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా మోడీ నోటి నుంచి వచ్చిన మాటల్ని వింటే కాసింత అవాక్కు అవ్వాల్సిందే. తాను చేసే పనులకు ఏ మాత్రం పోలిక లేని కొన్ని వ్యాఖ్యలు మోడీ నోటి నుంచి రావటం ఆసక్తికరమైతే.. ఆయన తాజాగా చెప్పిన కొన్ని మాటలు వింటే.. కామెడీ కామెడీగా ఉంటాయని చెప్పాలి.
తనకు కోపం అన్నది ఉండదని చెప్పిన మోడీ మాట.. ఇంటర్వ్యూ మొత్తంలో సంచలన కామెంట్ గా చెప్పాలి. తనకు ఏ మాత్రం కోపం ఉందని.. ఇతరులపై కోపాన్ని ప్రదర్శించనని చెప్పారు. మోడీకి కోపం ఉంటుందా? లేదా? ఆయన ఒకసారి తన శత్రువులను ఫిక్స్ చేసుకుంటే వారికెన్ని చుక్కలు కనిపిస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మోడీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అందరికి తెలిసినా.. అదేమీ పట్టనట్లుగా తనకు కోపమే రాదని.. ఇతరులపై కోపాన్ని ప్రదర్శించరని చెప్పిన మోడీ మాట వింటే.. ఎంత చక్కగా మాటలు చెబుతారో.. అన్న భావన కలగటం ఖాయం.
ఇక.. ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని ముఖ్యాంశాలు ఇలానే ఉన్నాయి. వాటిని చూస్తే..
+ ప్రధాని అవుతానని అస్సలు ఊహించలేదు. సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకున్నా
+ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.
+ ప్రముఖుల జీవితకథల్ని చదవటం చాలా ఇష్టం
+ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. రామకృష్ణ మిషన్ స్ఫూర్తి
+ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటా
+ ఇతర పార్టీల్లోనూ ఆప్తమిత్రులు ఉన్నారు
+ పెద్ద పెద్ద వాళ్లను కలవటం కంటే.. చిన్నవాళ్లను కలవటమే ఇష్టం
+ పని చేస్తూ.. అందరితో పని చేయిస్తా
+ రాజకీయాల కంటే ఇతర విషయాలపై మాట్లాడటమే ఇష్టం
+ అందరితో సరదాగా గడపాలని ఆలోచిస్తా
+ సమయాన్ని వృధా చేయటం ఇష్టం ఉండదు
+ ఎంత పని ఒత్తిడి ఉన్నా.. అప్పుడప్పుడు అమ్మను కలిసి వస్తా
+ మనం చేసే పనిపై ఇష్టాన్ని పెంచుకుంటే సులువుగా పని చేయొచ్చు