Begin typing your search above and press return to search.
ఏసీబీకి అడ్డంగా దొరికిన ‘బుల్లెట్ బండి పెళ్లి కొడుకు’
By: Tupaki Desk | 21 Sep 2022 5:32 AM GMTదాదాపుగా ఏడాది క్రితం అనూహ్యంగా వార్తల్లోకి రావటమే కాదు.. సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్ లోనూ రచ్చ రచ్చగా మారటమే కాదు.. అతి తక్కువ సమయంలో సెలబ్రిటీ స్టేటస్ పొందిన ఒక సామాన్య జంట గురించి తెలిసిందే.
తన పెళ్లి సందర్భంగా నడిరోడ్డు మీద పెళ్లి కొడుకును ముందుపెట్టుకొని.. బెల్లెట్ బండి పాటను ఆలపిస్తూ వేసిన డ్యాన్స్ కు యూట్యూబ్ ఊగిపోయింది. సదరు బుల్లెట్ బండి పెళ్లికొడుకును గొప్పగా అభివర్ణిస్తూ ఆట ఆడిన మహిళ భర్త.. ఆకుల అశోక్ తాజాగా ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు.
బుల్లెట్ బండి సాంగ్ పెళ్లి కొడుకు అన్న ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఇతగాడు.. తాజాగా రూ.30వేల అవినీతి కోసం అడ్డంగా బుక్ అయ్యాడు.
బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తునన ఆకుల అశోక్.. తాజాగా ఇంటి నిర్మాణం అనుమతుల కోసం వస్తే రూ.30వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో దేవేందర్ రెడ్డి అనే బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు.
పక్కాగా ప్లాన్ చేసిన అధికారులు.. బాధితుడి చేతికి రూ.30వేలు ఇచ్చారు. దాన్ని తీసుకున్న ఫిర్యాదుదారు.. ఆకుల అశోక్ చేతికి ఇచ్చారు. అతను ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి అతగాడ్ని పట్టేసుకున్నారు.
ఈ నేపథ్యలో అశోక్ పని చేస్తున్న కార్పొరేషన్ కార్యాలయంతో పాటు.. అశోక్ ఇంట్లోనూ ఏసబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సెలబ్రిటీ స్టేటస్ రావటం చాలా అరుదు. అలా వచ్చిన ఇమేజ్ ను ఇలాంటి కక్కుర్తి పనులతో ఉన్న పేరును చెడగొట్టుకున్నాడన్న మాట వినిపిస్తోంది. భార్య సైతం ప్రభుత్వ ఉద్యోగిని కావటం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.