Begin typing your search above and press return to search.
ఆకుల కులం కామెంట్స్ - దేనికి సంకేతమో ?
By: Tupaki Desk | 21 Jun 2019 10:11 AM GMTఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎపుడు ఏ బ్రేకింగ్ న్యూస్ వస్తుందో తెలియని పరిస్థితి. ఒకరిద్దరు టీడీపీ లోక్ సభ ఎంపీలు పార్టీ మారతారేమో అని ఊహాగానాలు వస్తుంటే... హఠాత్తుగా నలుగురు రాజ్యసభ ఎంపీలు గంటల వ్యవధిలో పార్టీ మారి చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. ఈ భారీ కుదుపుతో టీడీపీ అల్లకల్లోలమైంది. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఉలిక్కిపాటుకు గురై స్పందించారు. యథా విధిగా తన స్టైల్లో కాన్ఫరెన్సులు పెట్టడం, కార్యకర్తలు బలం అని చెప్పడం అంతా జరిగిపోయింది.
ఇపుడు తాజా కుదుపు పవన్ జనసేనలో కనిపించేలా ఉంది. అసలే ఆ పార్టీలో కీలక నేతలు ఉన్నదే కొందరు. వారిలో ఒకరైన తూర్పుగోదావరి జిల్లా నేత ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ''కులసమీకరణాలతో రాజకీయం చేస్తే భంగపాటు తప్పదు. వచ్చే ఐదేళ్లలో పవన్ ప్రజల్లో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం.'' ఈ కామెంట్లన్నీ ఆయన పార్టీ మార్పును స్పస్టంగా సూచిస్తున్నాయి. కానీ జనానికి ఎక్కడ అర్థమైపోతాయో అని గ్రహించిన ఆకుల చెప్పాల్సినవన్నీ చెప్పి తనకు ''పార్టీ మారే ఆలోచన లేదు' అన్నారు.
ఇటీవలే వైజాగ్ నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా నిలబడిన జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగుదేశం, జనసేనలో పలువురు కాపు నేతలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఐదేళ్లు ఇవన్నీ భరించడమా? లేకపోతో ఏదో ఒక గట్టుకు చేరడమా? అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ అసెంబ్లీలో ఫిరాయింపులను ప్రోత్సహించను అని చెప్పడంతో కొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు డిజప్పాయింట్ అయ్యారు. కానీ ఓడిపోయిన నేతలకు మాత్రం డోర్లు తెరిచే ఉన్నాయని... వైసీపీ సంజ్జలు ఇచ్చినట్లే ఈ నేపథ్యంలో.. ఆకుల సత్యనారాయణ వంటి వారు వైసీపీ నుంచి పిలుపు వస్తే బాగుణ్ణు అని ఆసక్తిగా చూస్తున్నారు.