Begin typing your search above and press return to search.

బాబును నిధుల లెక్క చెప్పమంటున్న ఏపీ కమలనాథులు

By:  Tupaki Desk   |   3 May 2016 10:01 AM GMT
బాబును నిధుల లెక్క చెప్పమంటున్న ఏపీ కమలనాథులు
X
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ కేంద్ర సహాయ మంత్రి చౌదరి చేసిన వ్యాఖ్యతో ఏపీ రాజకీయాల్లో మొదలైన రాజకీయ వేడి ఇద్దరు మిత్రుల మధ్య దూరాన్ని రోజురోజుకి పెంచుతోంది. మోడీ సర్కారు తీరుపై ఆగ్రహం ఉన్నప్పటికి ఆచితూచి మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు భిన్నంగా ఏపీ తెలుగు తమ్ముళ్లు ధోరణి ఉంది. బీజేపీ తీరుపై ఓ రేంజ్ లో గుస్సా ప్రదర్శిస్తున్న తమ్ముళ్ల మాటల ధాటికి ఏపీ కమలనాథులు సైతం గళం విప్పుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదంటూ ఏపీ తెలుగుదేశం నేతలు విమర్శలపై తాజాగా ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సత్యనారాయణ మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో టీడీపీతో పొత్తు కోసం తామేమీ దేబిరించటం లేదంటూ ఘాటుగా రియాక్ట్ అయిన సత్యనారాయణ.. ఏపీ సర్కారుకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఏ విధంగా ఖర్చు చేశారన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్క చెప్పాలన్నారు.

కేంద్రం ఇప్పటివరకూ ఏపీ సర్కారుకు ఎన్నో నిధుల్ని ఇచ్చిందనిరచ్చ .. వాటిని ఏ విధంగా ఖర్చు చేయాలో చెప్పాలని.. నిధుల వినియోగం మీద బాబు సర్కారు శ్వేత పత్రం విడుదల చేయాలంటూ సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతల్ని విమర్శిస్తే మంత్రి పదవులు పొందొచ్చన్న ఆశతో కొందరు విమర్శలు చేస్తున్నారంటూ గుస్సా ప్రదర్శించారు. మొత్తమ్మీదా మిత్రుల మధ్య రచ్చ రోజురోజుకి ముదురుతుందనటంలో సందేహం లేదు.