Begin typing your search above and press return to search.

జనసేనకు భారీ దెబ్బ.. మరో సీనియర్ ఔట్

By:  Tupaki Desk   |   4 Oct 2019 7:48 AM GMT
జనసేనకు భారీ దెబ్బ.. మరో సీనియర్ ఔట్
X
జనసేనకు భారీ దెబ్బ పడింది. మరో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో అత్యంత సన్నిత సంబంధాలు కలిగిన ఆకుల సత్యనారాయణ రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద షాక్ లా మారింది..

బీజేపీ పార్టీలో ఉన్న ఆకుల సత్యనారాయణ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. రాజమండ్రి లోక్ సభ ఎంపీ సీటును జనసేన ఇవ్వగా పోటీచేశారు. అయితే వైసీపీ అభ్యర్థి భరత్ రామ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. ఆకుల సత్యనారాయణను ఎంపీగా నిలబెట్టి ఆయన ఓడిపోవడానికి పవన్ కారణమయ్యారన్న విమర్శలు ఆ సమయంలో వచ్చాయి.

2014లో బీజేపీ తరుఫున రాజమండ్రి సిటీలో పోటీచేసిన ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. దీంతో పవన్ కూడా ఆయనకు పార్టీలో అగ్రతాంబూలం ఇచ్చారు.

కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి.. ఏకంగా పవన్ కళ్యాన్ సైతం ఓడిపోవడంతో ఆకుల పునరాలోచనలో పడ్డారు. ఇటీవల కాలంలో జనసేన నుంచి మరో సీనియర్ నాయకుడు చింతల పార్థసారథి పార్టీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఆకుల కూడా గుడ్ బై చెప్పడంతో జనసేనకు భారీ దెబ్బ పడింది.

జనసేన నుంచి నాయకులు ఒక్కరొక్కరుగా వీడుతుండడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఈ సమయంలో నేతలు, కార్యకర్తల్లో భరోసా నింపాల్సిన పవన్ కళ్యాన్ పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితికి కారణమవుతోందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతల భవిష్యత్తుకు పవన్ భరోసానివ్వాలని కోరుతున్నారు.