Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ టెకీలు..జాబితాను స‌ర్కారుకు ఇచ్చిన అకున్

By:  Tupaki Desk   |   25 July 2017 1:05 PM GMT
డ్ర‌గ్స్ టెకీలు..జాబితాను స‌ర్కారుకు ఇచ్చిన అకున్
X
హైద‌రాబాద్‌ లో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న డ్ర‌గ్స్ మాఫియా సిని ప‌రిశ్ర‌మ‌ - పేజ్ 3 పీపుల్‌ ను దాటుకొని ఐటీరంగానికి సైతం చేరింద‌ని సాగుతున్న చ‌ర్చ‌ల్లో నిజమ‌ని తేలింది. సినీ ప‌రిశ్ర‌మ వ‌లే ఐటీ ప‌రిశ్ర‌మ‌కు మాఫియా సోకింది. ఈ విషయ‌న్ని సిట్ ద‌ర్యాప్తు అధికారి అకున్ స‌బ‌ర్వాల్ తెలిపారు. సచివాలయంలో హరితహారం - గుడుంబా రహిత రాష్ట్రం తదితర అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొన్న ఎక్సయిజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, తో సిట్ ప్రత్యేక అధికారి, డైరెక్టర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. అనంత‌రం సచివాలయంలోనే మీడియాతో సబర్వాల్ చిట్ చాట్ చేశారు. ఐటీ రంగంలో డ్రగ్స్ వాడుతున్న వారు ఉన్నార‌ని తెలిపారు. డ్ర‌గ్స్‌కు ఎడిక్ట్ అవుతున్న వివిధ ప్రముఖ కంపెనీల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌ కు డ్రగ్స్ ప్రాబల్యం ఉన్న కంపెనీల, డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వివరాల జాబితా అందించిన‌ట్లు ప్ర‌క‌టించారు. .

త‌మ విచార‌ణ‌లో భాగంగా సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 27 మందికి నోటీస్‌ లు ఇచ్చామ‌ని అకున్ స‌బ‌ర్వాల్ తెలిపారు. వివిధ చోట్ల వాళ్ళ విచారణ కొనసాగుతోందని అయితే ఆ వార్తలు మీడియాలో రావడంలేదని అన్నారు. నటి గౌతమి తన స్వచ్చంద సంస్థ త్వరలో పెద్దఎత్తున డీఆడిక్షన్ సెంటర్ నిర్వహించబోతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలీస్ దాడుల్లో రోజు 3 నుంచి 4 వందల కిలోల గంజాయి పట్టుబడుతోందని తెలిపారు. అప్పర్ సీలేరు - లోయర్ సీలేరు నుంచి గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా రవాణా అవుతోందని అకున్ స‌బ‌ర్వాల్ వివ‌రించారు. డ్రగ్స్ ఉదంతం నేపథ్యంలో మానసిక వైద్యులు, డ్రగ్ కౌన్సిలర్లకు గిరాకీ పెరిగిందని అన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను వారి దగ్గరకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కాగా, విచారణకు వస్తోన్న వాళ్ళు ఆలోవేరా జ్యుస్ - ఇతరత్రాలు బాగా వాడుతున్నారని అన్నారు. నెత్తికి చాలా ఖరీదైన - పవర్ ఫుల్ శాంపోలు వాడుతున్నారని వివ‌రించారు. భారీగా షాంపూ దట్టించి తల స్నానం కూడా చేసి విచారణకు హాజరు అవుతున్నారని అకున్ స‌బ‌ర్వాల్ వెల్ల‌డించారు.

నోటీసులు అందుకున్న పాఠాశాలలతో పాటు, ఇతర పాఠశాలలు చాలా మేరకు అవెర్ నెస్ చర్యలు చేప‌డుతున్నాయని అకున్ స‌బ‌ర్వాల్ వెల్ల‌డించారు. ఆకస్మిక తనిఖీలు, బ్యాగులు తనిఖీలు, బాత్ రూముల్లో తనిఖీలు, పాకెట్ మనీ తదితరాలకు సంబందించి పూర్తి నిఘా చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. మొబైల్ ఫోన్లు చాలా చోట్ల నిషేధించారని, కాల్ లిస్ట్ పై పూర్తి స్థాయి నిఘా వేశామ‌ని తెలిపారు. డ్రగ్స్ విచారణకు హాజరు అయ్యే అధికారులకు ముందు ఆధారాలు దొరకకుండా పెద్ద ఎత్తున ఆలోవేర జ్యూస్, హోమియోపతి డ్రింక్స్ సేవిస్తున్న సినిమా తారలు ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. డ్రగ్స్ కేసులో చార్మి హైకోర్టుకు అనవసరంగా వెళ్లిందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ - డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. సచివాలయంలో మీడియాతో చంద్రవదన్ - అకున్ సబర్వాల్ చిట్‌చాట్ చేసిన సందర్భంగా.. చార్మి నుంచి వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే పిలిచామని తెలిపారు. చార్మిని తాము నిందితురాలు అనలేదని స్పష్టం చేశారు. కోర్టుకు వెళ్లి.. పరోక్షంగా చార్మి నిందితురాలని తానే ఒప్పుకున్నట్టుగా ఉందన్నారు. సిట్ విచారణకు హాజరయ్యే వారిని నిందితులు అనడం లేదని స్పష్టం చేశారు అకున్, చంద్రవదన్. విచారణ మొత్తం రికార్డు అవుతుందన్నారు.