Begin typing your search above and press return to search.

ఆ 4 దేశాలను నాశనం చేయండి: అల్ ఖైదా పిలుపు

By:  Tupaki Desk   |   12 Sep 2019 9:32 AM GMT
ఆ 4 దేశాలను నాశనం చేయండి: అల్ ఖైదా పిలుపు
X
ఐసిస్ - అల్ ఖైదా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థలు ఇవీ.. ఐసిస్ ఉగ్రవాద సంస్థ అగ్రనేత అబు బకర్ - అల్ ఖైదా అగ్రనేత జవహర్ ల సారథ్యంలో ఈ రెండు సంస్థలు నడుస్తున్నాయి. వీరిద్దరి ఆచూకీ చెబితే 25 మిలియన్ డాలర్లను ఇస్తామని అమెరికా బహుమానం ప్రకటించింది. అయితే ఇద్దరూ తప్పించుకు తిరుగుతున్నారు. ప్రస్తుతం ఐసిస్ చురుగ్గా ఉండగా.. అల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత స్తబ్దుగా మారింది. అయితే తాజాగా అల్ ఖైదా చీఫ్ అయమన్ అల్ జవహరీ విడుదల చేసిన వీడియో ప్రపంచవ్యాప్తంగా గుబులు రేపుతోంది.

అమెరికాపై విద్వేషం పెంచుకున్న అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ 2001లో నాలుగు అమెరికన్ విమానాలను హైజాక్ చేయించి అమెరికా ట్రేడ్ సెంటర్ - పెంటగాన్ - పెన్విల్వేనియాలోని ఆర్థిక - రక్షణ మూలాలపై దాడులు చేయించాడు. సెప్టెంబర్ 11 - 2001న జరిగిన ఈ దాడులకు నిన్నటితో 18 ఏళ్లు నిండిన సందర్భంగా అమెరికా వ్యాప్తంగా చనిపోయిన 3వేల మందికి నివాళులర్పించారు.

అల్ ఖైదా ఉగ్ర సంస్థ చీఫ్ జవహరి తాజాగా 9/11 దాడులకు 18 ఏళ్లు అయిన సందర్భంగా ఒక వీడియో విడుదల చేసి జీహాదీలకు పిలుపునిచ్చాడు. అమెరికా - యూరప్ - ఇజ్రాయిల్ - రష్యాలే లక్ష్యంగా దాడులు చేయాలని జీహాదీలను కోరాడు. ఓ వీడియో ద్వారా ఈ సందేహం పంపాడు.

అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు అల్ ఖైదా చీఫ్ హెచ్చరికల నేపథ్యంలో ఆయా దేశాలు అలెర్ట్ అయ్యాయి. జవహరి ప్రస్తుతం అప్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లోంచే ఈ వీడియో తీసినట్టు అమెరికా నిఘావర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి.

9/11 దాడుల కోసం కొన్నేళ్లు వ్యూహాత్మకంగా కదిలి అమెరికాను దెబ్బతీసిన అల్ ఖైదా తాజా హెచ్చరికలను అమెరికా సహా పాశ్చాత్య దేశాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఉగ్రవాదులు ప్రిపేర్ అయ్యే ఈ హెచ్చరికలు చేసినట్టు అర్థమవుతోందని అమెరికన్ నిఘావర్గాలు అనుమానిస్తున్నాయట.. దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తమయ్యాయట..