Begin typing your search above and press return to search.
అల్ కాయిదా ట్రైనింగ్ మన పక్కనే బాస్
By: Tupaki Desk | 15 March 2016 10:40 AM GMTదేశ రాజధాని ఢిల్లీలోని ఓ కోర్టుకు ఢిల్లీ పోలీసులు గత వారంలో సమర్పించిన ఓ నివేదిక ప్రస్తుతం కలకలం రేపుతోంది. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలను వణికించిన ఉగ్రవాద సంస్థ ఆల్ కాయిదా పాకిస్తాన్ - అఫ్ఘనిస్తాన్ లలో వందలాది శిక్షణ శిబిరాలను నిర్వహించింది. వేలాది మందిని ఉగ్రవాదులుగా - ఆత్మాహుతి దళ సభ్యులుగా మార్చేసింది. అయితే ఇవన్నీ విదేశాల్లో ఉండేవని, ఇండియాలో అలాంటివి లేవు అనేది చాలా మంది అభిప్రాయం. కానీ వారి అభిప్రాయాలు పటాపంచాలయ్యాయి.
అల్ కాయిదా శిక్షణ కేంద్రం భారత్ లోని జార్ఖండ్ లోనూ ఉందని ఢిల్లీ పోలీసులు తాజాగా తేల్చారు. ఈ విషయంపై మరింత సమాచారం సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 14న అరెస్ట్ చేసిన ఆల్ కాయిదా ఉగ్రవాది మొహమ్మద్ ఆసిఫ్ కు సంబంధించిన చార్జిషీట్ దాఖలుకు మరింత సమయమివ్వాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. జార్ఖండ్ కు చెందిన అబూ సూఫియాన్ గతంలో టెర్రరిస్టుల క్యాంపు నిర్వహణకు సంబంధించి పాక్ లో శిక్షణ తీసుకుని వచ్చాడని సదరు నివేదికలో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం భారత్ వచ్చిన సూఫియాన్ జార్ఖండ్ లోని ఓ ప్రదేశంలో టెర్రర్ క్యాంప్ ను ఏర్పాటు చేశాడని తెలిపారు. అయితే దీనిని ఇంకా తాము గుర్తించలేదని పేర్కొన్నారు. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఈ మేరకు ఓ సంచలన కథనం ప్రచురితమైంది.