Begin typing your search above and press return to search.
ఈ గ్రామాన్ని వేలం వేస్తారట
By: Tupaki Desk | 6 Jun 2017 5:34 AM GMTసాధారణంగా వేలం అంటే ఎలా ఉంటుంది? ఒక ఇంటిని, స్థలాన్ని లేదా ఇంకేదో కీలకమైన ఆస్తినివేలంపాటతో అమ్మేయటం చూశాం. కానీ ఏకంగా ఓ గ్రామాన్నే వేలంపాటతో అమ్మేయాలనుకోవడం ఆసక్తికరమే కదా? అందులోనూ ఓ 15 మంది కలిసి తమ గ్రామాన్ని టెండర్ వేయడం క్రేజీ వార్తే కదా! స్పెయిన్ కు చెందిన దంపతులు తమ గ్రామాన్ని అమ్మేయాలనుకుంటున్నామని వేలం ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
స్పెయిన్ లోని అలాదిన్ గ్రామంలో కేవలం 15 మంది మాత్రమే నివసిస్తారు. వారంతా కలిసి మొబైల్ హోం...పార్క్...కేఫ్...హోటల్...బార్.. రెండంతస్తుల సూపర్ మార్కెట్లను నిర్వహిస్తుంటారు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఇవన్నీ తెరచే ఉంటాయి. ఈ గ్రామానికి యజమానులైన రిక్-జుడీ బ్రెంగల్ దంపతులు 31 ఏళ్లుగా ఈ గ్రామాన్ని కంటికి రెప్పలా సంరక్షించారు. అయితే ఇప్పుడు వారి వయసు 70 ఏళ్లు దాటింది. వయసు మీద పడటంతో గ్రామ నిర్వహణ వారికి భారంగా మారింది. దీంతో గ్రామాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చిన డబ్బుతో మరో చోట సంతోషంగా తమ శేష జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నారు. అందుకే గ్రామాన్ని వేలంలో అమ్మేందుకు ఓ వెబ్ సైట్ లో వివరాలను ఉంచారు. దీనికి మిగతా15 మంది సైతం అంగీకరించారు. దీంతో గ్రామం మొత్తం ఒక్కరే గానీ.. వేర్వేరు వ్యక్తులు అయినా కావచ్చు తమ వేలంలో కొనుక్కోవచ్చునట! ఆఫర్ ఆసక్తికరంగానే ఉంది కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/