Begin typing your search above and press return to search.
తమిళనాట మరో కొత్త పార్టీ .. ఈసారి ఎవరంటే?
By: Tupaki Desk | 24 Dec 2020 12:33 PM GMTతమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ఉన్న పార్టీలకి తోడుగా ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అంటూ ప్రకటించేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తునట్టు ప్రకటించారు. ఇక కమల్ హాసన్ ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు. దీనితో రోజురోజుకి ఉత్కంఠత పెరిగిపోతుంది.
ఇదిలా ఉంటే .. ఇప్పుడు మరో కొత్త ఉత్కంఠకు తెరతీశారు మాజీ సీఎం కరుణానిధి కుమారుడు అళగిరి. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న తన తల్లి దయాళు అమ్మాళ్ ను పరామర్శించడానికి ఆయన గోపాలపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనవరి 3న నా అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నా. కొత్త పార్టీ స్థాపనపై ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటా. ఒకవేళ నా కార్యకర్తలు కొత్త పార్టీ పెట్టాలని సూచిస్తే...కొత్త పార్టీని స్థాపిస్తా. అంతేగానీ, డీఎంకేకు మాత్రం మద్దతివ్వను అని అళగిరి కుండబద్దలు కొట్టారు.
డీఎంకేలోకి తిరిగి రమ్మని ఆహ్వానం అందిందా అని అడగ్గా., దానికి సమాధానం ఇస్తూ .. ఇప్పటి వరకూ అలాంటి ఆహ్వానమేదీ రాలేదని తెలిపారు. హైదరాబాద్ షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను రజనీకాంత్‌ను కలుసుకుంటానని అళగిరి వెల్లడించారు.