Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ కు తాజ్ మహల్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందబ్బా?

By:  Tupaki Desk   |   10 May 2022 10:30 AM GMT
ఎలన్ మస్క్ కు తాజ్ మహల్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందబ్బా?
X
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక బాంబు పేల్చే ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ తాజాగా మరో సంచలనానికి తెరతీశాడు. తాజాగా అతడు భారత్ పై పడ్డాడు. ఇటీవలే ట్విట్టర్ ను 45 బిలియన్ డాలర్లకు కొన్న ఎలన్ మస్క్ తాజాగా 2007లో తన భారత పర్యటనను గుర్తు చేసుకున్నారు. ప్రేమకు చిహ్నంగా నిలిచే తాజ్ మహల్, ఆ పక్కనే ఉన్న ఆగ్రా కోట నిర్మాణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. ఇవి నిజంగా ప్రపంచ వింతలేనని మస్క్ అభిప్రాయపడ్డారు.ఇక తాజాగా ఎలన్ మస్క్ అమ్మమ్మ తాతయ్యలు కూడా దాదాపు 70 ఏళ్ల కిందటే తాజ్ మహల్ ను సందర్శించడం విశేషం.

టెస్లా అధినేత ఎలన్ మస్క్ 2007లో తన భారత పర్యటన.. తాజ్ మహల్ సందర్శనను గుర్తు చేసుకున్నారు. తాజ్ మహల్ నిజంగా ప్రపంచ అద్భుతమని కీర్తించాడు. ఆగ్రాలోని ఎర్రకోట నిర్మాణ శైలిని కూడా కొనియాడారు. ఎర్రకోట ఆర్కిటెక్చర్ తనను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని మస్క్ అన్నారు.

ఆగ్రాకోట ముఖభాగాన్ని చూపుతున్న ఒక ట్వీట్ పై ఎలన్ మస్క్ ఈ విధంగా స్పందించడం వైరల్ గా మారింది. దీంతో టెస్లా అధినేత భారత పర్యటనపై మరోసారి ఊహాగానాలకు తెరతీసింది.

ఇక ఎలన్ మస్క్ ట్వీట్ పై ఆయన తల్లి మాయో మస్క్ కూడా స్పందించారు. ఎలాన్ మస్క్ అమ్మమ్మ తాతయ్యలు కూడా 1954లో తాజ్ మహల్ ను సందర్శించారని ట్విట్టర్ ద్వారా ఆమె వెల్లడించారు. వాళ్లు దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వెళుతుండగా మార్గమధ్యలో తాజ్ మహల్ ను సందర్శించినట్టు ఆసక్తికరమైన విషయాన్ని ఆమె పంచుకున్నారు.

రేడియో లేదా జీపీఎస్ లేకుండా సింగిల్ ఇంజిన్ ప్రొపెల్లర్ విమానంలో ఈ యాత్రను పూర్తి చేసిన వ్యక్తులు ఎలన్ తాతా-అమ్మమ్మలు అని మాయో మస్క్ తెలిపారు. మయో తన తల్లిదండ్రులు తాజ్ మహల్ వద్ద దిగిన ఫొటోలను షేర్ చేశారు.

ఇప్పుడు నెట్టింట్లో తాజ్ మహల్ పై ఎలన్ మస్క్ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎందుకు తాజ్ మహల్ ను గుర్తు చేసుకొని పొగిడారు.? దాని వెనుక కథ ఏంటి? అన్నది ఆసక్తిగా మారింది.