Begin typing your search above and press return to search.

రవిప్రకాశ్ కు షాక్..కార్లనూ లాగేశారబ్బా

By:  Tupaki Desk   |   14 Jun 2019 6:00 PM GMT
రవిప్రకాశ్ కు షాక్..కార్లనూ లాగేశారబ్బా
X
టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ నిజంగానే పెద్ద కష్టమొచ్చి పడింది. ఇప్పటికే అలంద మీడియా సంస్థ టీవీ 9ను కొనేసి... దానిని స్థాపించిన రవిప్రకాశ్ ను ఏకంగా మెడబట్టి గెంటేసినంత పని చేసింది. అంతటితో ఆగకుండా ఫోర్జరీ, నిధుల మళ్లింపు, లోగోల అక్రమ విక్రయం తదితరాలపై కేసులు పెట్టింది. ఈ కేసుల విచారణలో నానా పాట్లు పడుతున్న రవిప్రకాశ్ ను అలంద మీడియా ఇప్పుడు మరో దెబ్బ కొట్టింది. టీవీ 9లో ఉండగా రవిప్రకాశ్ సంస్థకు చెందిన కార్లనే వినియోగించేవారు. అయితే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన వాటిని వాపస్ చేయలేదు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన అలంద మీడియా... కోర్టు ఆదేశాలతో ఆ కార్లను స్వాధీనం చేసుకుంది. ఇలా తాను స్థాపించిన సంస్థ నుంచి గెంటేయబడి, ఆ సంస్థ కొత్త యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుతో రవిప్రకాశ్ నానా ఇబ్బందులు పడుతున్నారు.

తాజా ఉదంతం విషయానికి వస్తే... టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం ఆయన తిరిగి ఇవ్వలేదు. దీంతో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని కోర్టును కోరింది. రవిప్రకాశ్‌ వాడుతున్న ఖరీదైన వాహనాలు అలంద మీడియాకు చెందినవేనని, వాటిని అలంద మీడియాకు స్వాధీనం చేయాలని కోర్టు ఆదేశించడంతో కార్లను స్వాధీన పరుచుకున్నారు. కోర్టు ఆదేశాలతో రవి ప్రకాశ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు ముందుగా కార్లను సీజ్‌ చేశారు. ఆయన డ్రైవర్ల ఫోన్లను తీసుకున్నారు. అయితే ముందస్తు నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్‌ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.