Begin typing your search above and press return to search.
మద్యం ఎఫెక్ట్ ..భారీగా పెరిగిన గృహహింస కేసుల సంఖ్య !
By: Tupaki Desk | 1 Jun 2020 6:30 AM GMTహలో సార్ మా అయన తాగొచ్చి నన్ను , పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు మీరొచ్చి కాసింత భయం చెప్పండి సార్ ...ఇవి గత 10 రోజులుగా డయల్-100కు వెల్లువలా వస్తున్న ఫిర్యాదులు. వైరస్ కట్టడి లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం దుకాణాలని కూడా మూసేయడంతో మద్యం దొరక్క మందుబాబులు ఇంటి పట్టునే సైలెంట్ గా ఉండటంతో అందరూ హ్యాపీ గా ఉన్నారు. కానీ , లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చి మద్యం దుకాణాలని తెరవడంతో గృహహింస కేసులు మళ్లీ పెరిగిపోయాయి. మద్యం అమ్మకాలు పెరగడంతోనే గృహహింస కేసులు భారీగా పెరిగాయి అని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత మార్చి 24 నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గతంలో రోజుకు సగటున 400 వరకు కేసులు నమోదయ్యేవి. అయితే, లాక్ డౌన్ లో ఆ సంఖ్య సగానికిపైగా తగ్గింది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు రోజుకి దయాల్ 100 కి 150 కాల్స్ వస్తే అందులో 100 కాల్స్ గృహహింస కేసులు ఉండేవని ..అయితే ఇప్పుడు తిరిగి మళ్లీ మద్యం దుకాణాలు తెరవడంతో ఆ కేసుల సంఖ్య 300 నుండి 350 కి పెరిగింది అని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి.
గృహహింసకు సంబంధించి డయల్-100తో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న కేసుల్లో పోలీసులు సత్వరమే కేసులు నమోదు చేస్తున్నారు. కౌన్సెలింగ్ తో పరిస్థితిలో మార్పు వస్తుందనుకునే వారికి మహిళా భద్రత విభాగం నేతృత్వంలో ప్రత్యేకంగా టెలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే, ఎక్కువగా మద్యం వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయి అని మహిళలు కన్నీరు పెడుతున్నారు.