Begin typing your search above and press return to search.
మద్యం మోసగాళ్లు .. సినిమా తరహా లో మద్యం అక్రమరవాణా !
By: Tupaki Desk | 1 Sep 2020 10:50 AM GMTఏపీలో మద్యం ధరలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. మద్యం ధరలు పెంచడంతో పాటూ మద్యం షాపుల సంఖ్యను కొంచెం కొంచెం తగ్గిస్తోంది. దీంతో మందుబాబుల కు లిక్కర్ కష్టాలు తప్పడం లేదు. అందుకే సరికొత్త ఎత్తులతో పక్క రాష్ట్రాల నుండి గుట్టు చప్పుడు కాకుండా మందు తెస్తున్నారు. సరిహద్దుల్లో పోలీసుల కళ్లుగప్పి వచ్చేందుకు ప్రయత్నించి కొందరు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ లిక్కర్ స్మగ్లింగ్ గ్యాంగ్ లీలలు చూసి కొత్తగా ఏర్పాటైన ఎస్ ఈబీ అధికారులు సైతం షాక్ అవుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది.
చాట్రాయి మండలం పోలవరం దగ్గర సరిహద్దులో మద్యం పట్టుబడింది. వాహనాల్లో మద్యం బాటిళ్లు తరలిస్తే పోలీసులకు దొరికిపోతుండటంతో మద్యం అక్రమ రవాణాదారులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇద్దరు తెలంగాణ అశ్వారావుపేట నుంచి మద్యం తెస్తూ సంబంధిత అధికారులకి చిక్కిపోయారు . తనిఖీలు చేసినా దొరక్కుండా ఒంటికి స్టికర్లు అంటించుకుని మద్యం బాటిళ్లను సరిహద్దు దాటించే ప్రయత్నం చేశారు. నిఘా పెట్టిన పోలీసులు అనుమానం వచ్చి తనిఖీ చేస్తే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఇద్దరు ఒంటికి చుట్టూ స్టిక్కర్లు అంటించుకుని 105 మద్యం బాటిళ్లు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి ఎత్తులు చూసి పోలీసులకు దిమ్మ తిరిగింది. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బైక్ సీజ్ చేశారు.