Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లో మద్యం.. ఒక బాటిల్ ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 28 April 2020 11:30 PM GMTలాక్ డౌన్ తో సర్వం బంద్ అయినా ‘మద్యం’ అమ్మకాలు మాత్రం కొనసాగుతుండడం విశేషం. లాక్ డౌన్ మొదలై 37 రోజుల తర్వాత కూడా మార్కెట్లో విచ్చలవిడిగా మద్యం లభిస్తుండడం అధికారులను షాక్ కు గురిచేస్తోంది. అయితే ఈ మద్యాన్ని దాని ధరకు 10 రెట్లకంటే ఎక్కువకే అమ్ముకుంటూ మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
సామాన్యులు ఈ బ్లాక్ మార్కెట్ లో మద్యం కొనాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే. లాక్ డౌన్ లో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై విచ్చలవిడిగా తమ వైన్ షాపుల్లోని మద్యాన్ని పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అన్ని గ్రామాలు, పట్టణాల్లో త్రిబుల్ రేట్లకు కొనాలనుకునే వారికి మద్యం దొరుకుతుండడం విశేషం. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
లాక్ డౌన్ ప్రకటించినప్పుడు మద్యం షాపులు బంద్ అన్నారే కానీ వాటిని అధికారులు సీజ్ చేయలేదు. దీంతో ఇదే అదునుగా వైన్స్ యజమానులు సరుకును బయటకు తీసుకొచ్చి అమ్మేసుకున్నారు. గమనించిన మంత్రి శ్రీనివాసగౌడ్ వెంటనే మద్యం దుకాణాలు సీజ్ చేయాలని ఆదేశించినా అప్పటికే మద్యం మొత్తం తరలిపోయింది. కొన్ని చోట్ల మంత్రి ఆదేశాలను కూడా ఎక్సైజ్ అధికారులు బేఖాతరు చేసి వైన్స్ యజమానులకు సహకరించారనే విమర్శలున్నాయి. ఇక అక్కడక్కడ తక్కువగా మద్యం పట్టుకొని ఎక్సైజ్ అధికారులు తాము పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు.
కాగా మద్యం అమ్మకాల దందాలో వైన్ షాపుల యజమానులు దళారుల ద్వారా మద్యాన్ని కమీషన్లు ఇచ్చి అమ్మేస్తున్నారు. ఇందులో అబ్కారీ శాఖ అధికారులకు వాటాలు వెళుతున్నాయట.. దీంతో వారంతా సైలెంట్ గా ఉంటున్నారు. ముఖ్యంగా ఈ మద్యాన్ని నగరాలు, పట్టణాల్లోనే ఎక్కువగా అమ్మేస్తున్నారు. గ్రామాల్లో ఇంత ధర పెట్టి ఎవరూ కొనరు కాబట్టి అక్కడికి తరలించడం లేదట.. దీంతో పట్టణ జనాభా ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోందట..
మాములుగా 600 ఉండే రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ను బ్లాక్ లో ఏకంగా రూ.4600కు అమ్ముతున్నారట.. ఇక బ్లైండర్స్ స్పైడ్ ధర 1000 అయితే దాన్ని 6వేలకు అమ్ముతున్నారట..ఇక ఐబీ (రూ.3,700), ఎంసీ డైట్ (రూ.3,700), బ్లాక్ లేబుల్, వైట్ లేబుల్ (రూ.11,000), సిగ్నేచర్ (రూ.5,500), రాయల్ గ్రీన్ (రూ.4,600) చొప్పున అమ్ముతున్నారు.ఇక వీటిని అందించినందుకు సర్వీస్ చార్జి కింద రూ.100-350 వరకు వసూలు చేస్తున్నారు.ఇక లైట్ బీర్ రూ.500వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్ లో డిమాండ్ ను బట్టి రేటును పెంచేస్తున్నారు.
ఇక ఈ రెండు నెలలకు సంబంధించి ఏకంగా రూ.1200 కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు పడిపోయాయి. ఆరు నెలలే వ్యాలిడిటీ కావడంతో ఇందులో ఏకంగా కోటిన్నర లీటర్ల నీరు వృథా అయిపోయింది. ఇది ఎక్స్ పైరీ కావడంతో దీన్ని పారబోస్తారు. ఇలా ఎండాకాలంలో హాట్ కేకులైన బీర్లు వృథాగా డ్రైనేజీ పాలు కాబోతున్నాయి.