Begin typing your search above and press return to search.

మద్యం యమా డేంజర్... గతేడాది 7.4 లక్షల మందికి క్యాన్సర్‌ !

By:  Tupaki Desk   |   15 July 2021 6:33 AM GMT
మద్యం యమా డేంజర్... గతేడాది 7.4 లక్షల మందికి క్యాన్సర్‌ !
X
మద్యం ఆరోగ్యానికి హానికరం..ఇది అందరికి తెలుసు ,కానీ పాటించేవారే తక్కువ. ముఖ్యంగా మనుషులకి ఏది చేయకూడదు అంటే , అదే చేయాలనే ఓ పట్టుదల ఉంటుంది. మద్యం ఆరోగ్యానికి హానికరం రా బాబోయ్ అంటున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా బాటిల్స్ కి బాటిల్స్ తాగేస్తున్నారు.

ఒక రకంగా ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. అందుకే కరోనా మహమ్మారి కారణంగా , కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చి మొదటగా ఓపెన్ చేసింది కూడా మద్యం దుకాణాలనే. మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వ పరిపాలన కుంటుపడుతుంది అనేది జగమెరిగిన సత్యం.

ఇదిలా ఉంటే .. మద్యపానం వినియోగానానికి, ప్రాణాంత‌క క్యాన్స‌ర్ వ్యాధికి చాలా ద‌గ్గ‌రి సంబంధం ఉందన్న విషయం తాజాగా ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. 2020వ సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా న‌మోదైన క్యాన్స‌ర్‌ కేసుల‌లో 7.4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులకు మద్యం వినియోగంతో సంబంధం ఉందని ఈ అధ్య‌య‌నంలో తేల్చారు. ఈ అధ్య‌య‌న ఫ‌లితాలు తాజాగా ద లాన్సెట్ ఆంకాల‌జీ అనే జ‌ర్న‌ల్‌ లో ప్రచారం చేశారు. గతేడాది కొత్త‌గా బ‌య‌ట‌ప‌డ్డ క్యాన్సర్‌ కేసులలో 4 శాతం కేసులు ఆల్క‌హాల్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధం ఉందని స్పష్టం అయ్యింది.

దీనితో క్యాన్స‌ర్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్న దేశాల్లో ప్రాణాంతక వ్యాధికి, మద్యానికి ఉన్న సంబంధం గురించి ప్ర‌జ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశోధ‌కులు చెప్తున్నారు. దీనికి ప్ర‌భుత్వాల జోక్యాలు పెరగాల‌ని వారు తెలిపారు.

ఇక గతేడాది న‌మోదైన ఆల్క‌హాల్ అసోషియేటెట్ క్యాన్స‌ర్ కేసుల‌లో మ‌హిళ‌లతో (23 శాతం) పోల్చుకుంటే పురుషులు(77 శాతం) చాలా ఎక్కువ శాతంలో ఉన్నార‌ని అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఇక క్యాన్స‌ర్ ర‌కాల విష‌యానికి వ‌స్తే ఆల్క‌హాల్ అసోషియేటెడ్ క్యాన్స‌ర్ కేసుల‌లో అన్నవాహిక, లివ‌ర్‌, బ్రెస్ట్ క్యాన్స‌ర్‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తేలింది.

అంతేకాకుండా ఆల్కహాల్ వినియోగం వల్ల ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశముందని బలమైన రుజువును ఓ అధ్యయనం తేల్చింది. అయినప్పటికీ అమెరికాలో చాలా మంది మహిళలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆల్కహాల్ అధికంగా తీసుకుంటున్నట్లు నిరూపితమైంది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆల్కహాల్ రిసెర్చ్ గ్రూపు మహిళల్లో రొమ్ముక్యాన్సర్ ప్రమాదం గురించి ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత 30 ఏళ్లుగా ఎన్నో అధ్యయనాలు మద్యం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సాక్ష్యాలతో నిరూపించాయి. కానీ ఇది నిజంగా వాస్తవమని చాలా మంది మహిళలకు తెలియదు ఏఆర్జీతో ప్రముఖ శాస్త్రవేత్త ప్రిస్సిల్లా మార్టినెజ్ తెలిపారు.

మద్యపానం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 7 నుంచి 16 శాతం పెంచుతుందని రిసెర్చ్ కు చెంది విశ్వసనీయ వర్గాల సమాచారం. 2019లో మెడిసిన్ రిపోర్ట్స్ ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం 15 నుంచి 44 ఏళ్ల వయస్సు గల మహిళల్లో 25 శాతం మందికి ఈ ప్రమాదం గురించి అవగాహన ఉన్నట్లు తేలింది.

చాలా మంది యువతులు పరిమితి కంటే అధికంగా ఆల్కహాల్ తీసుకుంటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని మార్టినెజ్ అభిప్రాయపడ్డారు. ఆల్కహాల్ వల్ల రొమ్ము క్యాన్సర్ రావడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమి లేవు. కానీ కొన్ని అంచనాల ద్వారా మద్యం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించగలిగారు. ఆల్కహాల్ వల్ల క్యాలరీల గురించి అంచనా వేయలేం. ఫలితంగా ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అధిక కొవ్వు క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేసే అవకాశముంటుంది.

ఆడవారిలో ఈస్ట్రోజన్ స్థాయిని పెంచడమేకాకుండా ఇతర హార్మోన్లపై ప్రభావం చూపి రొమ్ము క్యాన్సర్ కు దారితీస్తుంది.మద్యం అధికంగా తీసుకునేవారిలో ఫోల్ యాసిడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే పురుషుల్లోనూ క్యాన్సర్ ప్రమాదముంది. అయితే ఇది రొమ్ము క్యాన్సర్ కాదు. మగవారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటుంది.