Begin typing your search above and press return to search.
మందుబాబులు ఫుల్ ఖుషి ...ఆనందంలో డ్యాన్సులు !
By: Tupaki Desk | 4 May 2020 10:30 AM GMTకరోనా లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా వైన్ షాపులు క్లోజ్ చేసారు. దాదాపుగా మందు దొరక్క 40 రోజులు దాటిపోతుంది. దీనితో మందుబాబులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఈ లాక్ డౌన్ సమయంలో మందుబాబులు కొందరు పిచ్చోళ్లుగా కూడా మారిపోయారు. అలాగే కొంతమంది మందు దొరకలేదు అని ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఎట్టకేలకి కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఈ రోజు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.
దీనితో మందుబాబుల ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు. దీనితో నిన్నటివరకు నిరసంగా కనిపించిన మందుబాబులు ఇప్పుడు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. కొందరు వైన్స్‌ల ఎదుట కొబ్బరికాయలు కొడితే - మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా బాణాసంచా కాల్చారు. ఇంకా కొందరైతే చాలా సేపు క్యూలైన్ లో నిలిచొని.. బాటిల్ చేతిలో పడగానే వెంటనే లాగించేస్తున్నారు.
ఇక, తెలంగాణలో మద్యం షాపులు ఓపెన్ చేయడానికి సీఎం కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తే.. ఏపీలో మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనితో ఏపీలో ఈ రోజు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో రోడ్డెక్కిన మందుబాబులు చివరకు బాటిల్ చేతికి అందగానే డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా 'రింగ రింగ' పాటను అందుకున్నాడు.. 'మందు బాటిల్ దొరికేసినాది.. మాకు ఇంకా పండగేనులే' అని పాటపాడుతూ.. స్టెప్పులు వేశాడు.. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. అయితే - మందుబాబులు మద్యం షాప్స్ ఓపెన్ చేయడం పై హర్షం వ్యక్తం చేస్తున్నా కూడా..అక్కడ సామజిక దూరం పాటించడం లేదని , దీనివల్ల కరోనా పెరిగే అవకాశం ఉందని కొందరు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.