Begin typing your search above and press return to search.
మద్యమే హంతకుడిని పట్టించిందా ?
By: Tupaki Desk | 14 Dec 2020 12:30 AM GMTహత్య చేసిన వ్యక్తిని మద్యమే పట్టించిందా ? అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే చేసిన హత్యను హంతకుడు మందు మైకంలో స్నేహితులకు చెప్పేశారు. అయితే ఆ విషయం స్నేహితుల ద్వారా అలా అలా బయటకు పాకిపోయి పోలీసుల చెవిన పడటంతో చివరకు కటకటాల పాలయ్యారు.
ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ లో కనకరాజు అనే టీఆర్ఎస్ నేతున్నారు. ఈయనకు ఓ అమ్మాయితో అక్రమ సంబంధం ఉందట. అదే అమ్మాయితో శ్రీకాంత్ అనే మరో యువకుడు కూడా అక్రమ సంబంధమే పెట్టుకున్నాట. అయితే ఆ విషయం కనకరాజుకు చాలా ఆలస్యంగా తెలిసింది. విషయం తెలియటంతో ఇద్దరిని బెదిరించినట్లు సమాచారం.
అయితే ఆరుమాసాల క్రితం శ్రీకాంత్, ఆ అమ్మాయి లేచిపోయారు. దాంతో ప్రిస్టేజ్ ఫీలైన మన నేత వాళ్ళకోసం తెగ వెదికించాడు. చివరకు ఇద్దరినీ ఎక్కడో పట్టుకుని నగరానికి తీసుకొచ్చి జవహర్ నగర్లో బంధించాడు. కొద్ది రోజులు ఇద్దరినీ బాగా హింసించిన తర్వాత శ్రీకాంత్ ను తానే స్వయంగా చంపేశాడు. ఆ విషయాన్ని హంతుకుడు కొద్ది రోజుల తర్వాత స్నేహితులతో మందుకొడుతున్నపుడు చెప్పేశాడట.
అంటే మైకంలో ఏమి మాట్లాడుతున్నాడో తెలీని స్టేజిలో చెప్పాడో లేకపోతే తన గొప్పదనాన్ని చాటు కోవాలని కున్నాడో తెలీదు. మొత్తానికి విషయం అయితే బట్టబయలైంది. ఇదే విషయం తర్వాత స్నేహితుల ద్వారా ఆనోటా ఈనోటా పాకిపోయింది. అదే సమయంలో శ్రీకాంత్ కనబడటం లేదనే ఫిర్యాదు కూడా వచ్చిందట. దాంతో విషయం పోలీసుల చెవినపడటంతో ఆచూకీ తీశారు. తమ దగ్గరున్న ఫిర్యాదుకు తమ చెవిన పడిన సమాచారానికి సరిపోవటంతో వెంటనే కనకరాజును అదుపులోకి తీసుకున్నారు.
తమదైన స్టైల్లో పోలీసులు విచారిస్తే మొత్తం విషయం అంతా బయటపడిపోయింది. శ్రీకాంత్ ను చంపేసిన కనకరాజు మృతదేహాన్ని ఆల్వాల్ ప్రాంతంలోని హస్మత్ పేట శ్మశానవాటికలో పూడ్చిపెట్టినట్లు చెప్పటమే కాకుండా పోలీసులను తీసుకెళ్ళి చూపించాడట. దాంతో విషయం ఇపుడు సంచలనంగా మారింది.