Begin typing your search above and press return to search.

జగ‌న‌న్న ఖాతాకు మ‌స్తు పైస‌లు ! అదిగో ...

By:  Tupaki Desk   |   28 July 2022 5:15 AM GMT
జగ‌న‌న్న ఖాతాకు మ‌స్తు పైస‌లు ! అదిగో  ...
X
మ‌ద్య నిషేధం అన్న‌ది మాట్లాడుకోకూడ‌ని మాట. నిషేధం స్థానంలో నియంత్ర‌ణ అన్న ప‌దం వాడ‌మ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చెబుతున్న మాట. క‌నుక కొత్త‌గా బార్ల ఏర్పాటుకు సంబంధించి చ‌ర్య‌లు వేగ‌వంతం చేసింది.

ఆ విధంగా సంబంధిత ద‌రఖాస్తుల‌కు ఆహ్వానం చెప్పగా, 840 బార్ల‌కు సంబంధించి 1672 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి అని తేలింది. వీటి రూపంలో ఖ‌జానాకు వందకోట్లు రానుంది అని తెలుస్తోంది. ఇందులో అర‌వై కోట్ల రూపాయ‌లకు పైగా ఖ‌జానాకు చేరిపోయాయి అని తెలుస్తోంది. అదేవిధంగా మ‌రింత మొత్తాలు వ‌చ్చే అవకాశాలు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

అంటే ఒక్క ద‌ర‌ఖాస్తుకే ఇంత మొత్తంలో డ‌బ్బులు వస్తే మిగ‌తా ప్ర‌క్రియ‌లో ప్ర‌భుత్వానికి వ‌చ్చేదెంత.. అన్న విష‌య‌మై కూడా కొన్ని వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. వాస్త‌వానికి జ‌నాభా ఆధారంగా బార్ల ఏర్పాటుకు ఐదు నుంచి ఏడు ల‌క్ష‌ల యాభై వేల రూపాయ‌లు ఒక్కో ద‌ర‌ఖాస్తుకు వ‌సూలు చేశార‌ని తెలుస్తోంది.

కొన్నింట ప‌ది ల‌క్ష‌ల రూపాయల చొప్పున కూడా వ‌సూలు చేశార‌ని తెలుస్తోంది. అంటే 3 కేట‌గిరీల్లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించి సంబంధిత మొత్తాల‌ను వ్యాపారుల నుంచి వ‌సూలు చేశారు అన్న‌ది సుస్ప‌ష్టం అవుతోంది.

ప్ర‌భుత్వానికి కేవ‌లం ద‌ర‌ఖాస్తుల ద్వారానే ఎలా చూసుకున్నా 122 కోట్ల రూపాయ‌ల ఆదాయం చేకూర‌నుంద‌ని ప్ర‌ధాన మీడియా అంచ‌నావేస్తోంది.

కొంత‌మంది వ్యాపారులు రుసుము చెల్లించ‌కుండానే విత్ డ్రా అయిపోతుంటారు అని, ఆ విధంగా చూసుకున్నా త‌క్కువ‌లోత‌క్కువ ద‌ర‌ఖాస్తుల రూపంలో ప్ర‌భుత్వానికి వంద కోట్ల ఆదాయం రావ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.