Begin typing your search above and press return to search.

మేడారంలో నాటు సారా విక్ర‌యాలు ! కేసీఆర్ వింటున్నారా ?

By:  Tupaki Desk   |   20 March 2022 4:30 AM GMT
మేడారంలో నాటు సారా విక్ర‌యాలు ! కేసీఆర్ వింటున్నారా ?
X
ప్ర‌ముఖ జాత‌ర మేడారం జాత‌ర లో సారా విక్ర‌యాలు విప‌రీతంగా సాగిపోతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.త్రిదండి చిన‌జియ‌రు స్వామిజీ అక్క‌డ వన దేవ‌త‌ల‌కు కానుక‌గా ఇచ్చే బంగారం (బెల్లం) ను ప‌క్క‌దోవ ప‌ట్టించి నాటు సారా త‌యారీకి వినియోగిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు.అంటే నాటు సారాను ఇంత‌కాలం కేసీఆర్ నిలువ‌రించ‌లేక‌పోయారా? లేదా ప‌ది,ప‌దిహేనేళ్ల కింద‌టి మాట‌లు ఇప్ప‌టికీ అదేవిధంగా నిజం అవుతూ వ‌స్తున్నాయా?

వాస్త‌వానికి తెలంగాణ‌లో చిన్న చిన్న పండుగ‌ల‌కు కూడా దావ‌త్ ఉంటుంది.ఆ విధంగా చూసుకుంటే మేడారం జాత‌ర‌లో నాటు సారా విక్ర‌యాలు అన్న‌వి పెద్ద విష‌యం కాదు.కానీ ప‌ల్లె సంస్కృతిని కించ ప‌రిచి స్వామీజీ మాట్లాడిన మాట‌లు విరుద్ధంగా ఉన్నాయి.ఎందుకంటే సారా వ‌ద్దు హాయిగా అమ్మ‌వార్ల ఆరాధ‌న చేయండి అని చెబితే స‌రిపోయేది కానీ ఆయ‌న అక్క‌డ బిజినెస్ జ‌రుగుతోంది అని చెప్ప‌డం అత్యంత బాధాక‌రంగా భావిస్తున్నారు భ‌క్త వ‌ర్గాలు.

రెండోది మేడారంలో జంతు బ‌లులు జ‌రుగుతున్నాయి అని అంటున్నారు స‌రే! మ‌రి! బ‌క్రీద్ వేళ‌ల్లో జ‌రిగే వాటిని ఏమంటారు? భ‌క్తి పూర్వక నైవేద్య స‌మ‌ర్ప‌ణ అని అంటారా అని హిందూ స‌మాజంలో కొన్ని వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి. గో వ‌ధ త‌ప్పు..మీరు చేయ‌కండి..అని చెప్ప‌వ‌చ్చు కానీ స్వామి అలా చెప్ప‌రు. చెప్ప‌లేదు కూడా! అందుకే ఈ వివాదం మ‌రింత రాజుకుంటుంది.నిన్న కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పే ఉద్దేశంతో ఆయ‌న మీడియా ముందుకు రాలేదు కేవ‌లం ఓ వివ‌ర‌ణ ఇచ్చారు..అని ఇంకొంద‌రు ప్ర‌జాస్వామిక వాదులు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.

వాస్త‌వానికి వైదికానికి ప‌ల్లె సంస్కృతుల్లో న‌డ‌యాడే గ్రామ దేవ‌త‌ల సంస్కృతికి ఎంతో తేడా ఉంది.వాటిపై కొంద‌రికి భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి కానీ చిన జియ‌రు స్వామీజీ మాదిరిగా వాళ్లెవ్వ‌రూ దురుసుగా మాట్లాడ‌లేదు.అవును! చాతుర్మాస్య దీక్ష పాటించాలంటే నియమాలు పాటించాల్సిందే! అందుకే ఎవ‌రు ప‌డితే వాళ్లు దీక్ష చేయ‌రు ఒప్పుకుంటాం కానీ అదే మాట చెబుతూ చెబుతూ ఈ మాట రోడ్డు మీద పోయే పుల్ల‌య్య‌ల‌కు నేను చెప్ప‌లేదు అని అన‌డం త‌ప్పు..అని చాలా మంది ప్ర‌జా సంఘాల నాయ‌కులు మండిప‌డుతున్నారు.కొన్ని సంప్ర‌దాయాల‌ను,విశ్వాసాల‌ను గౌర‌విస్తూ వెళ్ల‌డంలోనే భిన్న‌త్వంలో ఏక‌త్వ సాధ‌న అన్న‌ది దాగి ఉంద‌ని కూడా వాళ్లంతా హిత‌వు చెబుతున్నారు.పీర్ల పండుగ వ‌చ్చిందంటే చాలు హిందూ, ముస్లింలు క‌లిసి ఆనందిస్తారు.ఆ సంస్కృతి కార‌ణంగా ఇరు మ‌తాలూ క‌లిసి మెల‌సి జీవితాల‌ను ఆనంద‌మ‌యం చేసుకుంటున్నాయి.

అదే విధంగా మేడారం జాత‌ర కూడా! వేర్వేరు మతాల‌కు కూడా ఆ వ‌న‌దేవ‌త‌లే ఆరాధ‌నీయం కావ‌డం ఎంత గొప్ప విష‌యం. హిందూ సంస్కృతికి మాత్ర‌మే మేడారం జాత‌ర ను చూడ‌కూడ‌దు అని అది ఆసియా లో అతి పెద్ద జాత‌ర అని అంటే ఎన్నో మ‌తాలు వ‌ర్గాలు ఇక్క‌డికి రావ‌డానికి ఇష్ట‌ప‌డుతూ ఎంద‌రికో ఉపాధి క‌ల్పిస్తున్న జాత‌ర కూడా ఇదేన‌ని అంటున్నారు ఆ ప్రాంత వాసులు.