Begin typing your search above and press return to search.

మద్యం సేవించి మరీ మహిళలు సెక్స్ కు సై సై!

By:  Tupaki Desk   |   24 July 2019 1:30 AM GMT
మద్యం సేవించి మరీ మహిళలు సెక్స్ కు సై సై!
X
గతంలో మద్యపానం అనేది ఒక చెడ్డ వ్యసనం అనే అభిప్రాయం అధిక శాతం భారతీయుల్లో ఉండేది. కానీ అది ఇప్పుడు దాదాపుగా మారిపోయింది. ఇప్పుడు కూడా మద్యపానం చెడ్డ వ్యసనమే కానీ.. 'తాగితే పోతారు' అని సినిమాల్లో కూడా చెప్తూనే ఉంటారు కానీ జనాలు దీన్ని చూసే దృష్టిమారింది. ఇది ఒక సాధారణ విషయం.. రాద్ధాంతం అవసరంలేని వ్యవహారం అన్నట్టుగా సర్దుకుంటున్నారు. ఈ యాక్సెప్టెన్స్ తో మందుబాబులే కాదు మందుపాపలు కూడా ఎక్కువ అవుతున్నారట. మహిళల్లో మద్యపానం అలవాటు ఉండేవారి శాతం పురుషులతో పోలిస్తే ఎక్కువగా పెరుగుతోందట.

అయితే ఇక్కడ మన అసలు టాపిక్ మహిళల మద్యపానం కాదు.. మద్యపానంతో మిక్స్ అయ్యే సెక్సు. అమెరికాలో అరవై శాతం మహిళలకు మద్యపానం అలవాటు ఉందని గతంలో ఒక సర్వేలో తెలింది. అదే సర్వేలో డ్రింక్ కు సెక్సు కు లంకె ఉందని కూడా తేలిందట. మద్యం సేవించిన మెజారిటీ సమయాలలో అది సెక్సుతో పరిపూర్ణం అవుతుందని తేలిందట. ఇది ఎనిమిదేళ్ళ క్రితం అమెరికాలో సర్వే మాట. కానీ ఈ ట్రెండ్ ఇండియాలో కూడా మొదలైందట. మద్యం అలవాటు ఉండే మహిళల్లో ఎక్కువమంది రెండు పెగ్గులేసి ఆ మత్తులో రతికేళికి సై అంటున్నారని రీసెంట్ గా ఇండియాలో జరిగిన ఒక స్టడీలో వెల్లడయింది.

ఈ స్టడీలో తమ అభిప్రాయాలను వెల్లడించిన చాలామంది మహిళలు మద్యం సేవించిన తర్వాత తమ భాగస్వామితో చాలా ఓపెన్ గా ఉంటామని అంటున్నారు. సాధారణం గా సెక్స్ చేసినప్పటితో పోలిస్తే మద్యం మత్తులో ఎక్కువ ఎంజాయ్ చేసినట్టుగా.. ఆర్గాజం ఎక్కువ సమయం ఉన్నట్టుగా చెప్పారు. అదే కాకుండా మద్యం సేవించినప్పుడు కోరికలు ఎక్కువగా ఉంటాయని కూడా తెలిపారు.

మద్యం ప్రభావంతో భాగస్వామి వద్ద ఓపెన్ గా ఉండడం.. ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం నిజమేనట. కానీ ఆర్గాజమ్ స్థాయి మాత్రం మహిళలు తాము అనుకున్న స్థాయిలో కంటే తక్కువే ఉంటుందని స్టడీలో వెల్లడయింది. నాన్ డ్రింకర్స్ తో పోలిస్తే .. రోజూ ఒకటి రెండు గ్లాసుల వైన్ సేవించే మహిళలలో తమ సెక్స్ లైఫ్ పట్ల సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉందని తేలిందట. దీనికి కారణం మద్యం సేవించే సమయంలో తమ భాగస్వామితో చేసే ముచ్చట్లు సెక్స్ కు ఫోర్ ప్లే తరహాలో ఉపయోగపడడమేనట.

డ్రింక్ చేసే మహిళలు వెల్లడించిన మరో సంగతి ఏంటంటే.. సాధారణంగా బాడీ ఇమేజ్(లావు.. సన్నం.. పొట్టి.. నలుపు.. అలోచిస్తూ తమను తక్కువగా అనుకోవడం లేదా రివర్స్ లో ఆలోచించడం) గురించి ఆలోచిస్తూ సెక్స్ లో పెద్దగా ఫోకస్ చెయ్యలేరట. కానీ మద్యం సేవించిన సమయంలో ఈ బాడీ ఇమేజ్ అనే అంశమే గుర్తురాదని..దీంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెక్స్ లో పాల్గొంటారట. అందుకే సెక్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తామని అంటున్నారు.

ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే భారతీయమహిళలు గతంలో లాగా భర్త తాగి వస్తే "ఛీ ఛీ తాగుబోతు సచ్చినోడా.. గుప్పున వాసన వస్తోంది. నువ్వు బైటఛావు" అని ఇబ్బంది పెట్టేవారు తక్కువై.. "నీకో పెగ్గు నాకో పెగ్గు ఇద్దరికీ పెద్ద హగ్గు" అంటూ పాడుకునే జనాలు ఎక్కువయ్యారు!