Begin typing your search above and press return to search.
ట్రంప్ ను సూటిగా ప్రశ్నిస్తున్న ఏడేళ్ల చిన్నారి
By: Tupaki Desk | 2 Feb 2017 4:57 PM GMTఏడంటే ఏడేళ్ల చిన్నారి అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. చాక్లెట్ కావాలనో.. ఐస్ క్రీం ఇప్పించమనో. . లేదంటే ఆడుకోవటానికి బొమ్మలు కావాలని మారం చేసే వయసులో సిరియా చిన్నారి.. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ప్రశ్నిస్తోంది. ట్వీట్స్ తో సవాలు విసురుతోంది. ‘‘మిస్టర్ ట్రంప్ మీరు ఎప్పుడైనా ఫుడ్ లేకుండా 24 గంటల పాటు ఉన్నారా?’’ అంటూ ప్రశ్నించటమే కాదు.. సిరియా శరణార్థుల గురించి ఆలోచించరా? అంటూ ప్రశ్నిస్తోంది.
ఆ చిన్నారి అడుగుతున్నప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శరణార్థుల దీన స్థితిని తెలిపేలా చిన్నారి అడుగుతున్న ప్రశ్నలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. ముస్లిం మెజార్టీ దేశస్తులు తమ దేశంలోకి రావటాన్ని అడ్డుకుంటూ జారీ ఉత్తర్వులపై ఏడేళ్ల బానా అలాబెద్ స్సందిస్తూ.. ‘‘నేను ఉగ్రవాదినా?.. డియర్ ట్రంప్.. శరణార్థులను నిషేధించటం చాలా చెడ్డ నిర్ణయం. సరే.. ఒకవేళ అది మంచి నిర్ణయం అయితే.. నాదో మాట. మీరుఇతర దేశాలను శాంతియుతంగా మార్చండి’’ అని పేర్కొంది.
తన తల్లిదండ్రుల కారణంగా తనపరిస్థితి ఫర్లేదని.. కానీ.. ఎంతోమంది చిన్నారులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని.. వారి గురించి ఆలోచించాలని కోరింది. గత ఏడాది సెప్టెంబరులో ట్విట్టర్ లో చేరిన ఈ సిరియా చిన్నారి.. తన ఇల్లు ఎలా కూలిపోయిందో ట్వీట్లతో చెప్పే ప్రయత్నం చేసి.. ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇప్పటికే ఆమె ట్విట్టర్ ఖాతాను లక్షలాదిమంది ఫాలో అవుతున్నారు. తాజాగా ఆమె విడుదల చేసిన వీడియోఇప్పుడు వైరల్ గా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/