Begin typing your search above and press return to search.

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ ... జులై 1 నుండి రోజు విడిచి రోజు క్లాసులు !

By:  Tupaki Desk   |   24 Jun 2021 6:30 AM GMT
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ ... జులై 1 నుండి రోజు విడిచి రోజు క్లాసులు !
X
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా గందరగోళంగా ముందుకు సాగుతోన్న విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 1 నుండి విద్యాసంస్థలని తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఆన్‌ లైన్ లో క్లాసులు నిర్వహించినా , అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయో తెలియని పరిస్థితిలో నేరుగా స్కూళ్లను తెరిస్తేనే విద్యార్థులకు మంచిదని ప్రభుత్వం భావించి , విపత్కర సమయంలో కూడా ఈ డేరింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అన్నీ కేటగిరీల విద్యాసంస్థలను రీఓపెన్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఇక జులై 1 నుండి రాష్ట్రంలోని ఇంటర్ స్టూడెంట్స్ కి తరగతులు ప్రారంభం కానుండగా , ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ఓ కీలక ప్రతిపాదనను పంపింది. ఇంటర్ విద్యార్ధులకి రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించాలని ,ఇంటర్ బోర్డు నిర్ణయించింది. క్లాసులు ఉన్న రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 3 వరకు తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 3 వరకు సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఖచ్చితంగా కాలేజీకి రావాల్సిందే అన్న ప్రతిపాదన ఏమి లేదని , కాలేజీకి రాకుంటే ఆన్ లైన్ లో క్లాసులు వినొచ్చు అని తెలిపింది.