Begin typing your search above and press return to search.
అలెర్ట్: ఇంట్లో కాసింత డబ్బులు ఉంచుకోండి!
By: Tupaki Desk | 19 April 2018 5:26 AM GMTఏటీఎంలు డ్రై అయిపోయాయి. బ్యాంకుల దగ్గరకు వెళ్లి రూ.లక్ష మొత్తం కావాలంటే టైం (అన్ని బ్యాంకులు.. బ్రాంచులు కాదు కొన్ని మాత్రమే) అడుగుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లోని బ్యాంకులు నగదు కొరతను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
విమానాల్లో నగదును తీసుకొచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లోనూ.. ఏటీఎంలలోనూ నింపేస్తామని చెబుతున్న పరిస్థితి. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? నగదు కష్టాలు ఎప్పటికి తీరతాయి? అప్పటివరకూ ఏం చేస్తే మంచిదన్న సందేహాలు చాలామందిలో ఎక్కువ అవుతున్నాయి.
బ్యాంకింగ్ అధికారుల మాటల ప్రకారం నగదు కొరతను సీరియస్ గా తీసుకోవటంతో పాటు.. బ్యాంకుల్లో క్యాష్ క్రంచ్ అన్నది లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే క్యాష్ క్రంచ్ వ్యవహారం కేంద్రం దృష్టికి వెళ్లటం.. సీన్లోకి జైట్లీనే రావటంతో బ్యాంకులు సైతం నగదు కొరత అన్న మాట వినపడకుండా ఉండేలా చర్యలు మొదలెట్టాయి.
మామూలుగా అయితే.. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం ముందుండి బ్యాంకుల్ని నడిపిస్తాయి.తాజా ఎపిసోడ్ లో మాత్రం కేంద్రం కంటే ముందుగా రియాక్ట్ అవుతున్న బ్యాంకులు వేర్వేరు నగరాల్లోని బ్యాంకులతో మాట్లాడి నగదును భారీగా తీసుకొచ్చేలా చర్యలు షురూ చేశాయి.
ఇప్పటివరకూ ఉన్న అంచనా ప్రకారం రేపు.. ఎల్లుండి (శుక్ర.. శనివారాలు) నాటికి డబ్బులు రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తాయని.. ఏటీఎంలలో నింపేయటం జరిగిపోతుందని చెబుతున్నారు. గడిచిన కొద్దిరోజులుగా నో క్యాష్ అన్న బోర్డులు దర్శనమిస్తున్న నేపథ్యంలో.. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన నగదును ఏటీఎంలలో పెట్టిన వెంటనే విపరీతమైన విత్ డ్రాయిల్స్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు వీలుగా రెండు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలు.. పట్టణాల్లో రోజుకు రెండు దఫాలు ఏటీఎంలను క్యాష్ తో ఫిల్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం గడిచిన రెండు.. మూడు రోజులుగా హైదరాబాద్ మహానగరంలోని కొన్ని బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లు భారీగా తగ్గినట్లుగా తెలుస్తోంది. బ్యాంకుల్లో నగదు కొరత నెలకొన్న నేపథ్యంలో తమ దగ్గర ఉన్న నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విషయంలో ప్రజలు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెంటిమెంట్ ను బలోపేతం చేసేందుకు వీలుగా క్యాష్ ను పంప్ చేయాల్సి ఉంటుంది. దీనిపై బ్యాంకులు ప్రస్తుతం వర్క్ వుట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలోని ఏటీఎంలపై ప్రజల్లో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలి.. వాటిని ఎప్పటి మాదిరి నోట్లతో కళకళలాడేలా చేయటం కోసం బ్యాంకులు నడుం బిగించాయి. అయితే.. ఈ ప్రయత్నం అంతా అనుకున్నట్లు జరగటానికి కాస్త టైం పట్టే వీలుండే అవకాశం ఉంది. అందుకే.. కాస్త ముందుజాగ్రత్తగా కాసింత క్యాష్ ను చేతిలో ఉంచుకోవటం చాలా అవసరం. లేకుంటే.. అవసరానికి ఏటీఎం సెంటర్లకువెళ్లి.. వాటి చుట్టూ తిరగటానికే టైం సరిపోతుందన్నది మర్చిపోవద్దు.