Begin typing your search above and press return to search.
ఓవైపు పోతారంటుంటే.. ఈ నేత మాత్రం వస్తారంటున్నాడు
By: Tupaki Desk | 13 Oct 2022 4:22 AM GMTకొద్ది రోజుల క్రితం ఎంపిక చేసిన కొంతమంది మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. ఆ సందర్భంగా పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించటం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్టీ మారతారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలానికి కారణం అయ్యాయి. ఆయన వ్యాఖ్యల్ని రేవంత్ తో సహా పలువురు ఖండించారు. కట్ చేస్తే.. తాజాగా కేటీఆర్ మాటలకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ పార్టీ నేత.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
మీడియా ఫోకస్ తన మీద పడాలని అనుకున్నారా? నిజంగానే అన్న విషయం మీద స్పష్టత రానప్పటికీ.. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఉత్తర తెలంగాణ నుంచి ఒక ఎంపీ.. దక్షిణ తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రానున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఓవైపు మునుగోడు ఎన్నికలు పోటాపోటీగా సాగుతూ.. పోటీ మొత్తం టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. ఏలేటి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఓవైపు పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతూ.. త్వరలోనే తెలంగాణలో అడుగు పెట్టనున్న వేళ.. ఏలేటి చేసిన వ్యాఖ్యల మీద అందరి చూపు పడేలా చేశాయని చెప్పాలి.
పార్టీలోకి వచ్చే నేతలంతా ఇప్పటికే టచ్ లోకి వచ్చేశారని.. త్వరలోనే పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. ఏలేటి మాటల్ని చూస్తుంటే.. రాహుల్ పాదయాత్ర తెలంగాణలో సాగుతున్న వేళలో.. ఈ చేరికలు ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.
కాంగ్రెస్ మీద పెద్దగా అంచనాలు లేని వేళలో.. చేరికలు ఉంటాయా? అన్న సందేహం వెంటాడుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.