Begin typing your search above and press return to search.
అక్కడ ఫేస్ బుక్ మత్తు వదిలించే ఆసుపత్రి
By: Tupaki Desk | 20 July 2016 4:24 AM GMTఏదైనా మితంగా ఉండాలి. మోతాదు మించితే మొదటికే మోసం వస్తుంది. ఇందుకు సోషల్ మీడియా కూడా మినహాయింపు కాదు. నిత్యం స్మార్ట్ ఫోన్లను అదే పనిగా ఓపెన్ చేస్తూ.. ఫేస్ బుక్ లో స్టేటస్ ను అప్ డేట్ చేసుకోవటం.. పోస్టింగ్ లను చెక్ చేసుకోవటం.. కామెంట్లు పోస్ట్ చేయటం.. షేర్ చేయటం.. లైక్స్ గుప్పించటం.. ఛాటింగ్ లతో కాలాన్ని గడిపేసే వాళ్లను చాలామందినే చూస్తుంటాం. మొదట సరదాగా మొదలై.. చివరకు అదో సీరియస్ వ్యసనంలా మారే దుస్థితి. చాలామంది అర్థం చేసుకోరు కానీ.. ఫేస్ బుక్ వినియోగించటం మత్తు పదార్థాల వినియోగం కంటే ఎక్కువగా దీనికి కనెక్ట్ అవుతారు. ఫేస్ బుక్ తో నిత్యం ఎంగేజ్ అయ్యేవారు.. ఒక రోజంతా దానికి దూరంగా ఉండాలని ట్రై చేస్తే పిచ్చెక్కిపోయే వాళ్లు చాలామందే ఉంటారు.
ఇలాంటి వారికి తామేదో కోల్పోయినట్లుగా.. ప్రపంచానికి దూరమైనట్లుగా.. ఆత్మీయుల్ని పోగొట్టుకున్నట్లుగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ దరి చేరాయంటే.. ఫేస్ బుక్ మిమ్మల్ని లోబర్చుకున్నట్లే. మీరు.. ఫేస్ బుక్ కి బానిస అయినట్లే. చాలామందికి తమకు తాము తెలీకుండానే ఫేస్ బుక్ మాయాజాలంలో బందీలై బయటకు రాలేని పరిస్థితి. నమ్మరు కానీ.. ఇలాంటి వారి సంఖ్య కొన్ని దేశాల్లో భారీగా ఉంది.
అందుకే.. ఈ తరహా బ్యాచ్ కు కౌన్సెలింగ్ ఇచ్చి.. వారిని ఫేస్ బుక్ మత్తు నుంచి బయటపడేసేందుకు ప్రత్యేకంగా క్లినిక్ లు ఓపెన్ అవుతున్నాయి. అల్జీరియాలోని కాన్-స్టాంటిన్ లో ఇటీవలే ఒక ప్రైవేటు క్లినిక్ ఓపెన్ చేశారు. ఈ ఆసుపత్రి అందించే సేవల జాబితాలో డ్రగ్స్ కు.. ఆల్కహాల్ కు బానిసలైన వారితో పాటు.. ఫేస్ బుక్ బాధితులకు కూడా చికిత్స చేస్తామని చెబుతున్నారు. ఫిజికల్ డ్రగ్స్ కు ఏ మాత్రం తీసిపోని మత్తుపదార్థం ఫేస్ బుక్ అని చెబుతారు ఆ క్లినిక్ వైద్యులు రవూఫ్ బొకాపా. ఆ దేశంలో కోటిమంది ఫేస్ బుక్ ను వినియోగిస్తుండగా.. వీరి సంఖ్య ఏటా పది శాతం చొప్పున పెరుగుతోంది. దీనికి తగ్గట్లే ఫేస్ బుక్ కు బానిసలైన వారి సంఖ్య భారీగా పెరుగుతున్న దుస్థితి. ఇలాంటి వారికి ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు ఇక్కడి క్లినిక్ లలో స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. సో.. ఫేస్ బుక్ వాడండి. కానీ.. మితంగానే ఉండండి. అంతకు మించితే మొదటికే ముప్పు సుమా.