Begin typing your search above and press return to search.

అప్ఘనిస్తాన్ కొత్త అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ?

By:  Tupaki Desk   |   15 Aug 2021 6:00 PM IST
అప్ఘనిస్తాన్ కొత్త అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ?
X
అప్ఘనిస్తాన్ లో పౌరప్రభుత్వం ఓడిపోయింది.తాలిబన్లకు తలవంచింది. రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అప్ఘనిస్తాన్ దేశమొత్తం ఆక్రమించినట్టైంది. దీంతో తమ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలోనే అప్ఘనిస్తాన్ లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై అప్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్ గా అలీ అహ్మద్ జలాలీని నియమించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు మధ్యవర్తిగా అత్యున్నత స్థాయి జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు.

ఇక తాలిబన్లు రాజధాని ఆక్రమించిన తర్వాత ఒక ప్రకటనలో ప్రజలకు హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాము కాబూల్ లోకి సైనికపరంగా ప్రవేశించబోమని తెలిపారు. శాంతియుతంగానే వస్తున్నట్లు తెలిపారు.

ఇక అప్ఘానిస్తాన్ ప్రభుత్వం సైన్యం తాలిబన్లతో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయింది. తాలిబన్ అగ్ర నేతలు తమ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాచారంలో కాబుల్ గేట్ల వద్దనే ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకూ కాబూల్ లోనే తాలిబన్లు ఉండనున్నారు.