Begin typing your search above and press return to search.
జగన్ని డైరెక్ట్ గా అడిగేసిన ఆలీ... ?
By: Tupaki Desk | 11 Dec 2021 1:31 PM GMTఆలీ టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్. ఆలీ బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. తొంబై దశకంలో హీరోగా కూడా నటించి పలు సక్సెస్ లను అందుకున్నారు. ఆలీకి పరుగు ఎక్కడ ఆపాలో తెలుసు కాబట్టి హీరో కిరీటాన్ని అలా పక్కన పెట్టి మరీ తన నటనను వివిధ పాత్రలతో మేళవించి రంజింపచేసుకున్నారు.
ఆలీకి రాజకీయాలంటే ఇష్టం. ఆయన మొదట తెలుగుదేశంలో కూడా పనిచేశారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇవ్వలేదు కానీ ఎమ్మెల్సీ పదవికి హామీ ఇచ్చారని టాక్. ఇక ఆలీ తనవరకూ తాను గట్టిగానే పార్టీ విజయం కోసం ప్రచారం చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి లభించడం ఖాయమని ఆయన భావిస్తూ వచ్చారు.
ఇపుడు దానికి మరింత మసాలా జోడించారు. తనకు జగన్ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అంటూ మనసులో ఉన్న కోరికను తాజాగా అలా బయటపెట్టుకున్నారు. జగన్ పాలన భేష్ అంటూనే తన ఆకాంక్షను కూడా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు జగన్ ఏలుబడిలో సుఖంగా ఉన్నారని ఆయన పేర్కొనడం విశేషం.
ఇవన్నీ ఎలా ఉన్నా మంత్రి పదవి కావాలంటూ ఓపెన్ గా ఆలీ అప్పీల్ చేసుకోవడం మాత్రం విశేషమే. వైసీపీలో ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో మంత్రి పదవుల కోసం క్యూ ఉంది. అలాంటిది ఉభయ సభలలో ఎక్కడా సభ్యుడు కూడా కాని అలీ మంత్రి అయితే తనకు సంతోషమని బోల్డ్ గా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే నిజంగా ఆలోచించాల్సిన విషయమే మరి.
అయితే ఆలీ అంటే జగన్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది అంటారు. ఆలీ నటుడు మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల ద్వారా జనాలకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇక మైనారిటీ వర్గ నేతగా కూడా పేరుంది. రాజమండ్రీకి చెందిన ఆలీకి పదవి ఇస్తే వైసీపీకి ఉపయోగమే అన్న లెక్క కూడా ఉంది.
మరి మంత్రులుగా గతంలో సినీ నటులు కొందరు అయ్యారు. రాణించారు కూడా. రాజు తలచుకుంటే వరాలు ఇవ్వడం సులువే. జగన్ మదిలో ఏముందో కానీ ఆలీ ఇలా చెప్పడం అంటే అనూహ్యంగా మంత్రి గిరీ ఆలీ లాంటి వారిని వరించి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. వచ్చే ఎన్నికలు వైసీపీకి ఒక సవాల్. పైగా సినీ రంగం తో కూడా కొంత గ్యాప్ ఉంది. ఈ టైమ్ లో అక్కడ నుంచి ఆలీ లాంటి వారి ఫుల్ సపోర్ట్ వైసీపీకి ఉండడం అంటే పొలిటికల్ గా ప్లస్ అవుతుంది. ఇలాంటి లెక్కలు అన్నీ వైసీపీ పెద్దలకు బాగా తెలుసు కాబట్టి ఆలీ మంత్రి పదవి కావాలీ అని ఈజీగా అని ఉండడనే అంటున్నారు. సో ఏం జరుగుతుందో. చూడాలి.