Begin typing your search above and press return to search.
అలీ పొలిటికల్ కెరీర్ కు ఇది పెద్ద దెబ్బే..
By: Tupaki Desk | 24 Jan 2019 7:59 AM GMTఅలీలో ఫస్ట్రేషన్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోతోంది.. సినిమాల్లో చాన్స్ తగ్గడంతో నోటికి పనిచెబుతున్నాడు. వివిధ టీవీ షోలు - సినిమా ఫంక్షన్ లలో నోరు జారుతూ చిక్కుల్లో పడుతున్నాడు. పలు సినిమా వేదికలపై అగ్ర హీరోయిన్ల నడుములు - తొడల గురించి కామెంట్లు చేసి ఇప్పటికే అలీ వివాదాలు రేపాడు.. ఆ వివాదాలు మరిచిపోకముందే బుధవారం రాత్రి మలయాళం సినిమా ‘లవర్స్ డే’ ఫంక్షన్ లో మరోసారి అలీ కాంట్రవర్సీ సృష్టించాడు.. లవర్స్ డే మూవీ హీరో రోషన్ తన కొడుకులాంటివాడన్న సుమ వ్యాఖ్యలకు కౌంటర్ గా అలీ ‘ రాజీవ్ కనకాల ఎప్పుడు కేరళ వెళ్లాడు' అని నోరుపారేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో - మీడియాలో అలీ వ్యాఖ్యలు ట్రెండింగ్ లోకి వెళ్లాయి. ప్రతి ఒక్కరు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.. వైరల్ చేస్తున్నారు.
అలీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో రాజకీయ అరంగేట్రానికి అడుగులు వేస్తున్నారు.తాజాగా చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తా కథనాల ప్రకారం ఆలీ టీడీపీ లోకి చేరడం ఖాయమైందని అంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన ఆయనకు టికెట్ ను కూడా కేటాయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు-1 టికెట్ ఆలీ కోసం బాబు కేటాయించాడని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించని టీడీపీ.. ఆలీ కంటే బలమైన నాయకుడు వస్తే ఆయనకు టికెట్ కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు.. అప్పుడు ఆలీకి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయవచ్చంటున్నాడు. కామెడీతో జనాలకు పరిచయమైన ఆలీ తమ పార్టీలో ఉండే లాభమేనని టీడీపీ భావిస్తోంది. అయితే అయన వ్యాఖ్యలే అలీకి పెద్ద సమస్యగా.. పార్టీల పరువు ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారంగా మారింది.
అలీ ఇలా నోరు జారడంతో ఈయనను చేర్చుకోవాలనుకుంటున్న టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. అలీ వ్యవహార శైలి అంతిమంగా ఆయన పొలిటికల్ కెరీర్ కే పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశాలు కన్పిస్తున్నాయి.