Begin typing your search above and press return to search.
గుంటూరు తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా అలీ.?
By: Tupaki Desk | 25 Feb 2019 5:17 AM GMTస్టార్ కమెడీయన్ అలీ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. పేరుకు టీడీపీలో ఉన్నారనే కానీ మిగిలిన రెండు పార్టీలైన వైసీపీ - జనసేనతో కూడా టచ్ లో ఉన్నారు అలీ. ఇక తనకు ఎవరైతే మంత్రి పదవి ఇస్తారో ఆ పార్టీలో చేరతారని గతంలోనే అందరికి హింట్ ఇచ్చారు. ఇక నిన్నటికి నిన్న చంద్రబాబునాయుడు కూడా అలీని రాజకీయాల్లోకి రమ్మని అహ్వానించారు. దీంతో.. అలీకి గుంటూరు తూర్పు టిక్కెట్ ఇవ్వబోతున్నారని.. అందుకే అలీని అహ్వానించారని రాజకీయ వర్గాలంటున్నాయి.
గుంటూరు తూర్పు మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. రెండు సార్లు జియావుద్దీన్ తిరుగులేని మెజార్టీతో అప్పటి కాంగ్రెస్ నేత మహ్మద్ జానీపై గెలుపొందారు. అయితే2004లో గుంటూరు తూర్పు నియోజకవర్గంపై టీడీపీ పట్టు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన షేక్ సుభాని భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అలానే 2009లోనూజియావుద్దీన్ ఓటమి పాలయ్యారు. దీంతో2014లో ఆయనను తప్పించి మైనార్టీయేతర అభ్యర్థి అయిన మద్దాళి గిరిధర్ ని టీడీపీ బరిలోకి దింపింది. కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి మహ్మద్ ముస్తఫా విజయం సాధించారు. దీంతో.. ముస్లిం ఓటర్లు నిర్ణయమే ఫైనల్ అనే నిర్ణయానికి వచ్చేశారు చంద్రాబాబు. అందుకే.. ముస్లి అయిన అలీకి గుంటూరు తూర్పు టిక్కెట్ ఇవ్వాని డిసైడ్ అయినట్లు సమాచారం. అలీ కూడా మొదటి నుంచి తనకు రాజమండ్రి లేదా గుంటూరు తూర్పు టిక్కెట్ కావాలనే అడుగుతున్నారు. దీంతో.. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అలీ దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.