Begin typing your search above and press return to search.

థ‌ర్డ్ వ‌ర‌ల్డ్ వార్‌ పై జాక్ మా మాట విన్నారా?

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:19 AM GMT
థ‌ర్డ్ వ‌ర‌ల్డ్ వార్‌ పై జాక్ మా మాట విన్నారా?
X
ప్ర‌పంచ దేశాల‌న్నీ రెండు గ్రూపులుగా విడిపోయి... బాంబులు విసురుకున్న ప్ర‌పంచ యుద్ధాల‌తో పెను న‌ష్ట‌మే జ‌రిగింది. తొలుత మొద‌టి ప్ర‌పంచ యుద్ధం, ఆ త‌ర్వాత రెండో ప్ర‌పంచ యుద్ధం... వాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటూ ఇప్ప‌టికీ మ‌నం భీతిల్లిపోతున్నాం. నాటి యుద్ధాల‌ను మ‌నం చూడ‌కున్నా... వాటి ప్ర‌భావం ఏ మేర ఉంటుంద‌న్న విష‌యాలు ఇప్ప‌టికీ మ‌న కళ్ల‌కు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఆ ఆన‌వాళ్లే హిరోషిమా, నాగ‌సాకి న‌గ‌రాలు. రెండు ప్ర‌పంచ యుద్ధాల‌కు బెంబేలెత్తిపోయిన మ‌న పాల‌కులు... మ‌రోమారు ప్ర‌పంచ యుద్ధ‌మంటూ రాకుండా ఉండేందుకు అన్ని దేశాల మ‌ధ్య రాయ‌బారాలు న‌డ‌ప‌డ‌మే కాకుండా... ఆయా దేశాల మ‌ధ్య త‌లెత్తే పంచాయ‌తీల‌ను ప‌రిష్క‌రించేందుకు ఐక్య‌రాజ్య‌స‌మితిని ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి ఎన్ని సంస్థ‌లున్నా... యుద్ధాలు వ‌స్తూనే ఉన్నాయి. జ‌నం చ‌నిపోతూనే ఉన్నారు. అయితే ప్ర‌పంచ యుద్ధాలైతే మ‌ళ్లీ పున‌రావృతం కాలేద‌నుకోండి.

అయినా ప్ర‌పంచ యుద్ధాలు ఆయా దేశాల పాల‌కుల మొండి వైఖ‌రి - మూర్ఖ‌త్వం - ఈర్ష్యాద్వేషాలే కార‌ణ‌మ‌ని మ‌నం అనుకుంటున్నాం. అయితే ఇవేవీ కావంటున్నారు చైనా బిల‌య‌నీర్ జాక్ మా. ఆన్‌ లైన్ స్టోర్ అలీబాబా వ్య‌వ‌స్థాప‌కుడిగా జాక్ మా మ‌నంద‌రికీ బాగా తెలిసిన వ్య‌క్తే. ప‌నితీరులో ఇత‌రుల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే జాక్ మా... ఓ టీవీ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. మ‌రో 30 ఏళ్ల‌ల్లో వారానికి నాలుగు రోజులే ప‌నిచేసే వెసులుబాటు వ‌స్తుంద‌ని, అది కూడా రోజులో కేవలం నాలుగు గంట‌లు మాత్ర‌మే ప‌ని చేస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇందుకు ఆయ‌న త‌న జీవితాన్నే ఓ ఉదాహ‌ర‌ణ‌గా వివ‌రించారు. త‌న తాత రోజుకు 16 గంట‌ల పాటు ప‌నిచేసే వార‌ని, అయితే తాను మాత్రం ఇప్పుడు రోజుకు కేవ‌లం 8 గంట‌లే ప‌నిచేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇదే వ‌రుస‌న ఇంకో 30 ఏళ్ల‌కు రోజుకు నాలుగు గంట‌లు మాత్ర‌మే మ‌నం ప‌నిచేస్తామ‌ని, అది కూడా వారానికి నాలుగు రోజులే ప‌నిచేస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

వారానికి నాలుగు రోజులు, రోజుకు నాలుగు గంట‌లు మాత్ర‌మే ప‌నిచేసినా... మ‌నకు సౌక‌ర్యాల ప‌రంగా ఎలాంటి కొర‌త ఉండ‌ద‌ని, ఎందుకంటే ఇప్ప‌టికంటే కూడా మ‌రింత అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వ‌స్తుంద‌ని మా చెప్పారు. దీనికంత‌టికీ నానాటికీ మారుతున్న సాంకేతిక విప్ల‌వ‌మే కార‌ణ‌మ‌ని చెప్పిన జాక్‌... ఈ టెక్నాల‌జీ వ‌ల్లే ప్ర‌పంచ యుద్ధాలు జ‌రిగాయ‌ని తెలిపారు. మొట్ట‌మొద‌టిసారి వ‌చ్చిన సాంకేతిక విప్ల‌వం తొలి ప్ర‌పంచ యుద్ధానికి కార‌ణం కాగా, ఆ త‌ర్వాత వ‌చ్చిన రెండో సాంకేతిక విప్ల‌వం రెండో ప్ర‌పంచ యుద్ధానికి కార‌ణ‌మైంద‌ని చెప్పారు. ఇక తాజాగా మ‌నం చూడ‌బోయే మూడో సాంకేతిక విప్ల‌వం మూడో ప్ర‌పంచ యుద్ధం కూడా జ‌రిగి తీరుతుంద‌ని ఆయ‌న సెల‌విచ్చారు. మ‌రి జాక్ మా మాట నిజ‌మో, కాదో తేలాలంటే... మ‌నం మ‌రో 30 ఏళ్ల దాకా వెయిట్ చేయాల‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/