Begin typing your search above and press return to search.

10 వేల మంది ఇంటికి..: వృద్ధి రేటు తక్కువైందని ఉద్యోగులను తొలగించిన ‘ఆలీబాబా’..

By:  Tupaki Desk   |   7 Aug 2022 10:30 AM GMT
10 వేల మంది ఇంటికి..: వృద్ధి రేటు తక్కువైందని ఉద్యోగులను తొలగించిన ‘ఆలీబాబా’..
X
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంలో అగ్ర దేశాలే విలవిలలాడుతున్నాయి. ఈ తుఫానులో చైనా కూడా మినహాయింపు కాలేదు. కరోనా కాలం నుంచి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. తాజాగా ఈ పరిస్థితి తీవ్రమైందని తెలుస్తోంది. చైనాలోని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా తన కంపెనీలోని 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. డ్రాగన్ దేశ వ్యాప్తంగా వృద్ధి రేటు మందగించడంతో కంపెనీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా ఈ కామర్స్ సేల్స్ బాగా తగ్గిపోయాయి. దీంతో కంపెనీ పొదుపు చర్యలు చేపట్టేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలకడం తప్పడం లేదు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ఈ విషయాన్ని బయటపెట్టింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కూడా ఆలీబాబా గ్రూప్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం.

గత నెలలో ముగిసిన త్రైమాసిక వివరాల ప్రకారం ఆలీబాబా గ్రూప్ నుకు చెందిన 22.74 బిలియన్ల యువాన్ల విక్రయాలు జరింది. గతేడాదిలో మాత్రం 45.14 బిలియన్ల విలువైన వస్తువులను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఈ కంపెనీ సేల్స్ సగానికి సగం తగ్గిపోయాయి. దీంతో ఉద్యోగుల భారం తగ్గించుకుంటే తప్ప కంపెనీ ముందుకు సాగలేదని నిర్ణయించుకుంది. ఈ మేరకు 9, 241 మంది ఉద్యోగులకు తీసేసింది. దీంతో ఆర్థిక మాంద్యం దెబ్బ గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజాన్ని కూడా విడిచిపెట్టలేదని తెలుస్తోంది. అయితే ఆర్థిక మాంద్యం మాత్రమే కాకుండా ఆలీబాబా గ్రూప్ నకు, చైనా ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదాలు కూడా సేల్స్ తగ్గిపోవడానికి కారణమని తెలుస్తోంది.

రెండేళ్ల కిందట ప్రభుత్వంపై ఆలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్ మా విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతి చర్యగా ఆయన సంస్థలపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. అలీబాబా సంస్థలను టార్గెట్ చేసుకొని చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో జాక్ మా ఆలీబాబా సంస్థల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. అయితే ఇంతలో భారీగా ఉద్యోగులను తీసేయడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ తీసివేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందా..? లేదా.. దీనికి బ్రేక్ వేస్తారా..? అని అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఆలీబాబా కంపెనీపై గతంలో భారత్ సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ వినియోగదారులకు చెందిన డాటాను ఇక్కడి 72 సర్వర్ల ద్వారా చైనాకు చేరవేరుస్తుందని భారత అధికారులు గుర్తించారు. యూరోపియన్ సర్వర్లతో పోలిస్తే ఆలీబాబా క్లౌడ్ డేటా సర్వర్లు తక్కువ ధరల్లో సేవలందిస్తుంటాయని వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆలీబాబా క్లౌడ్ డేటా సర్వర్లు వ్యాపారాల్లో బాగా పాపులర్ పొందాయి. అయితే భారత్ నుంచి డేటాను అక్రమంగా తస్కరించి చైనాకు చేరవేసిందని ఆరోపిస్తున్నారు.