Begin typing your search above and press return to search.

సింగిల్ డే లో అమ్మిన అమ్మకాలు 91వేల కోట్లు

By:  Tupaki Desk   |   12 Nov 2015 10:30 PM GMT
సింగిల్ డే లో అమ్మిన అమ్మకాలు 91వేల కోట్లు
X
ఈ కామర్స్ జోరు ఏ రేంజ్ లో ఉంటుందన్న దానికి చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా తన సత్తా చాటటంతో పాటు.. పలువురిని విస్మయానికి గురి చేసింది. ఆన్ లైన్ దిగ్గజ కంపెనీ అయిన అలీబాబా సాధించిన ఈ రికార్డు అమ్మకాల్ని చూసి పలు కంపెనీల నోట మాట రాని పరిస్థితి. కేవలం ఒకే ఒక్క రోజు వ్యవధిలో రూ.91వేల కోట్ల అమ్మకాలు సాధించటం విశేషం.

ప్రతి ఏటా నవంబరు 11న ‘‘సింగిల్ డే’’ పేరిట భారీ ఆపర్లతో ఉక్కిరిబిక్కిరి చేసే అలీబాబా ఆన్ లైన్ సేల్ ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజు కొనుగోలు చేసేందుకు విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. ఈ నవంబరు 11న అలీబాబా గత ఏడాదితో పోలిస్తే భారీ వృద్ధి రేటులో భారీ మొత్తంలో అమ్మకాలు చేయటం విశేషం. తన గత రికార్డును తాజా సింగిల్ డే రికార్డుతో బద్ధలు కొట్టింది. గత ఏడాదితో పోలిస్తే..ఈ ఏడాది సింగిల్ డే సేల్స్ దాదాపు 60 శాతానికి పైనే పెరగటం విశేషం. 24 గంటల వ్యవధిలో రూ.91వేల కోట్ల మేర అమ్మకాలు జరిపిన అలీబాబా ఈ కామర్స్ సంస్థ.. భారీ అమ్మకాల నేపథ్యంలో ప్రతి నిమిషం 1.20లక్షల అర్డర్లు నమోదు అయ్యాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది సాధించిన రికార్డు స్థాయి అమ్మకాల్ని కేవలం 12 గంటల్లోనే అధిగమించినట్లుగా కంపెనీ పేర్కొంది. ఒక్కరోజులో ఒక కంపెనీ అమ్మకాలు 91వేల కోట్ల రూపాయిలు అంటే.. ఒక్కసారి పేపరు మీద అంకె వేసే ప్రయత్నం చేసి చూడండి.