Begin typing your search above and press return to search.
కర్ణాటకలో ఏలియన్ ను బంధించారా?
By: Tupaki Desk | 5 Jun 2018 7:07 AM GMTనిజమో.. అబద్ధమో.. కానీ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. షేర్ల మీద షేర్లు అవుతూ హాట్ టాపిక్ గా మారుతోది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గ్రహాంతరవాసికి సంబంధించి చాలానే వార్తలు వచ్చాయి. అయితే.. ఎప్పుడూ కూడా ఒక గ్రహాంతరవాసిని బంధించినట్లుగా వార్తలు వచ్చింది లేదు.
అందుకు భిన్నంగా తాజాగా కర్ణాటకలో ఒక గ్రహాంతరవాసిని బంధించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో జనసంచారం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో వింత జీవులు సంచరిస్తున్నాయని.. పశువుల్ని రాత్రికి రాత్రి గాయాలపాలువుతున్నాయని.. అలా జరిగిన కొద్ది రోజులకే ఆ పశువులు మరణిస్తున్న వైనం కలకలం రేపుతోంది.
దీంతో.. ఒక పథకం ప్రకారం ఒక గ్రామానికి చెందిన వారు రాత్రంతా మేలుకొని కాపు కాసి ఒక వింత జంతువును బంధించినట్లుగా తెలుస్తోంది. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటివరకూ బయటకు రాలేదు. సోషల్ మీడియా కథనం ప్రకారం ఒక వింత జీవిని గ్రామస్తులు పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఫోటో ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.అధికారులు అధికారికంగా ఈ అంశాన్ని నిర్దారించాల్సి ఉంది.