Begin typing your search above and press return to search.

ఎలుగుబంటిని చూసి గ్రహాంతరవాసులంటున్నారు

By:  Tupaki Desk   |   2 Dec 2016 8:24 AM GMT
ఎలుగుబంటిని చూసి గ్రహాంతరవాసులంటున్నారు
X
కర్ణాటక - కేరళ సరిహద్దుల్లో తాజాగా ఒక సంచలన వార్త తెగ స్ప్రెడ్ అవుతోంది... గ్రహాంతర జీవులు అక్కడ తిరుగుతున్నాయని.... జనంపై దాడి చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తం నాలుగు గ్రహాంతర జీవులు కర్ణాటక- కేరళ రాష్ర్టాల ప్రజలను కంగారుపెడుతున్నట్లుగా ప్రచారమవుతోంది. ఇవి మనుషులను - జంతువులను కూడా చంపేస్తున్నాయని చెబుతున్నారు. చిన్నచెవులు - కాళ్లకి పెద్దగా గోళ్లు ఉన్నాయని చెబుతున్నారు. నాలుగిట్లో ఒకటి పట్టుకుని బంధించారు కూడా.

అయితే... వెటర్నరీ డిపార్టుమెంటుకు చెందినవారు మాత్ర ఈ వాదనలు కొట్టిపారేస్తున్నారు. ఇవేవీ వింత జంతువులో.. గ్రహాంతర జీవులో కాదని చెబుతున్నారు. సాధారణ ఎలుగుబంట్లేనని.. అయితే, కుక్కలకు వచ్చే గజ్జి వంటి చర్మవ్యాధి రావడంతో మొత్తం వెంట్రుకలన్నీ ఊడి ఇలా తయారయ్యాయని.. అందువల్ల అవి ఎలుగుబంట్లులా కనిపించడం లేదని అంటున్నారు.

జబ్బు కారణంగా ఆహారం దొరక్క అన్నిటిపైనా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయనీ చెబుతున్నారు. కాగా మలేషియాలోనూ ఇంతకుముందు కొన్నిచోట్ల సన్ బేర్ లకు ఇలాంటి చర్మవ్యాధులు వచ్చిన ఉదంతాలున్నాయి. ఇప్పుడు కర్ణాటక - కేరళ ప్రాంతంలో కనిపిస్తున్న ఇవి కూడా గజ్జి పట్టిన సన్ బేర్లేనని తెలుస్తోంది.