Begin typing your search above and press return to search.

ఆ గ్రహంపై గ్ర‌హాంత‌ర‌వాసులున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   2 April 2018 1:49 PM GMT
ఆ గ్రహంపై గ్ర‌హాంత‌ర‌వాసులున్నార‌ట‌!
X
ఆకాశంలో ఫ్ల‌యింగ్ సాస‌ర్స్(ఎగిరే ప‌ళ్లాలు) క‌నిపించాయి.....ఆ ప్రాంతంలో ఏలియ‌న్స్(గ్ర‌హాంత‌ర‌వాసులు) జాడ‌లున్నాయ‌ని తెలిసింది......అమెరికాలోని మిలిట‌రీ బేస్ `ఏరియా 51` ప్రాంతంలో ఏలియ‌న్ల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నార‌ట‌.....వేరే గ్ర‌హాల్లో ఏలియ‌న్లు నివ‌సిస్తున్నాయి.....వారితో నాసా శాస్త్ర‌వేత్త‌లు సంభాషిస్తున్నారట‌......ఇవ‌న్నీ ఏలియ‌న్ల గురించి ద‌శాబ్దాల నుంచి ప్ర‌చారంలో ఉన్న పుకార్లు. అయితే, వీటిలో ఏ ఒక్క‌దానికి ఆధారాలు, సాక్ష్యాలు లేవు. దీంతో, అస‌లు ఏలియ‌న్లు ఉన్నాయా? లేవా? అన్న సందేహాలు ప‌లువురిని తొల‌చివేస్తున్నాయి. ఆ సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ఏలియ‌న్ల ఉనికిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా షాకింగ్ ప్ర‌క‌ట‌న చేసింది. భూమికి పొరుగునే ఉన్న వీనస్‌(శుక్ర‌గ్ర‌హం) గ్ర‌హం ఏలియ‌న్స్ జాడ‌ను గుర్తించిన‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

ఏలియ‌న్లు ఉన్నాయ‌ని, వాటి ఉనికి నిజ‌మేన‌ని దివంగ‌త‌ స్టీఫెన్ హాకింగ్స్ చాలా కాలం నుంచి చెబుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఆయ‌న వాద‌న‌కు బ‌లం చేకూరేలా నాసా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. శుక్ర గ్రహం మేఘాల్లో నల్లటి జాడలను కనుగొన్నామ‌ని, అక్కడ జీవదార్థాన్ని గుర్తించామ‌ని నాసా తెలిపింది. అందువ‌ల్ల , అక్క‌డ ఏలియన్లు నివసించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయ‌ని, త్వరలో ఆ విష‌యంపై మ‌రింత‌ స్పష్టత వ‌స్తుంద‌ని చెప్పింది. వీనస్ పై 500 డిగ్రీ సెల్సియస్‌ ఉష్టోగ్రత, ఆమ్ల వర్షంతో కూడిన ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఏలియ‌న్ల‌పై ప‌రిశోధ‌న‌లు చేసేందుకు నాసా ప్రత్యేక బృందం సన్నాహాలు చేస్తోంద‌ని తెలిపింది. ఏలియన్ల ఉనికి కోసం 240 మిలియన్ల డాలర్ల వ్యయంతో పరిశోధనలను కొనసాగించబోతున్నామ‌ని నాసా అధికారులు వెల్ల‌డించారు. కాగా, ఏలియన్ల ఉనికి గురించి నాసాకు చాలాకాలం క్రిత‌మే తెలుస‌ని, ఆ వాస్తవాలను నాసా ర‌హ‌స్యంగా ఉంచుతోంద‌ని బకింగ్‌హమ్‌ యూనివర్సిటీ పరిశోధనకారుడు, ప్రొఫెసర్‌ బారీ డి గ్రెగోరియో ఆరోపిస్తున్నారు. అంగారక గ్రహంలో ఏలియన్ల జాడను నాసా వారి క్యూరియాసిటీ రోవర్ క‌నిపెట్టింద‌ని, ఏలియ‌న్ల‌ ఫోటోలను తీసిందని ఆయన వాదిస్తున్నారు.