Begin typing your search above and press return to search.

ఏలియన్స్​ నన్ను కిడ్నాప్​ చేశాయి.. ఓ యువతి సంచలన ప్రకటన..!

By:  Tupaki Desk   |   10 May 2021 11:30 PM GMT
ఏలియన్స్​ నన్ను కిడ్నాప్​ చేశాయి.. ఓ యువతి సంచలన ప్రకటన..!
X
ఏలియన్స్​ ను మేము చూశాం.. గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారు. అప్పుడప్పుడు ఇటువంటి వాదనలు తెరమీదకు వస్తుంటాయి. ఏలియన్స్​ ను మేం చూశామంటూ చాలా మంది చెబుతుంటారు. అయితే నిజంగానే గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే వాళ్లు ఎలా ఉంటారు? అనే ప్రశ్న తరుచూ తెరమీదకు వస్తుంటుంది.గ్రహాంతరవాసులు అనే సబ్జెక్ట్​ మీద చాలా సినిమాలు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం పీకే అనే సినిమా కూడా గ్రహాంతరవాసి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా ఎంతో సక్సెస్​ అయ్యింది.

గతంలో చాలా మంది గ్రహాంతర వాసులను చూశామని చెప్పారు. అమెరికాలో గ్రహాంతరవాసుల ఆనవాళ్లపై రహస్యంగా పరిశోధన కూడా సాగుతున్నట్టు కొందరు చెబుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మహిళ గ్రహాంతరవాసుల అంశాన్ని తెరమీదకు తెచ్చింది. తనను గ్రహాంతర వాసులు 52 సార్లు కిడ్నాప్​ చేశారని సదరు మహిళ చెప్పడం గమనార్హం.

పౌలా అనే మహిళ గ్రహాంతరవాసుల గురించి మాట్లాడుతూ.. ' నేను చిన్నప్పటి నుంచి గ్రహాంతరవాసులను చూస్తూనే ఉన్నాను. నన్ను 52 సార్లు గ్రహాంతరవాసులు కిడ్నాప్​ చేశారు. 1982 తొలిసారి స్పేష్​ షిప్​ ను చూశాను. అక్కడ చాలా నిశ్శబ్ధంగా ఉంది. ఎంత సైలెంట్​గా ఉందంటే.. నా హార్ట్​బీట్​ నాకు వినిపిస్తోంది. అప్పుడే తొలిసారి నేను ఓ గ్రహాంతరవాసిని చూశాను. దానికి మూడు చేతులు ఉన్నాయి. ప్రతి చేతికి లైట్​ ఉంది. లైట్లు మూడు విభిన్నరంగుల్లో ఉన్నాయి. అది చాలా పొడుగ్గా ఉంది.

30 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉన్నాయి. నేను బెడ్​రూంలో ఉండగా.. నన్ను గ్రహాంతరవాసులు కిడ్నాప్​ చేసి తీసుకెళ్లేవి. నా కోసం నా తల్లిదండ్రులు గాలించేవారు. ఆ తర్వాత కొన్ని గంటలకు నేను మళ్లీ నా రూమ్​లో ఉండేదాన్ని' అంటూ చెప్పుకొచ్చింది పౌలా.

ప్రస్తుతం ఆమె ఏలియన్స్​ కు సంబంధించిన ఊహా చిత్రాన్ని గీస్తున్నారు. పౌలా చెప్పే విషయాలు మనం చిన్నప్పుడు చదువుకున్న బాలమిత్ర, చందమామ కథలను తలపిస్తున్నాయి. కొంతమంది ఆమె మాటలను నిజమని నమ్ముతుండగా.. మరికొందరు మాత్రం ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని అంటున్నారు.