Begin typing your search above and press return to search.
బెస్ట్ ఎగ్జాంఫుల్; ముస్లింలంతా చెడ్డోళ్లు కానే కాదు
By: Tupaki Desk | 5 July 2016 5:30 PM GMTగడిచిన కొద్దిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తమ దారుణకాండతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలీని అనిశ్చితి పరిస్థితిని కల్పించారు. పలు దేశాల రాజధానుల్లో ఆత్మాహుతి దాడులకు తెగబడటమే కాదు.. చివరకు ముస్లింలకు పరమ పవిత్రంగా -భావించే మదీనాలో కూడా ఆత్మాహుతి దాడి ద్వారా విద్వంసమే తమ లక్ష్యమన్న విషయాన్ని తాజా చర్యతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. మత ఛాందసవాదంతో తెగబడుతున్న ఉగ్రవాదులంతా ముస్లింలు కావటంతో.. చాలామందిలో ముస్లింల మీద సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.
ముస్లిం అంటే చాలు సందేహంగా చూడటం.. వారిని అనుమానపు చూపులతో గుచ్చి గుచ్చి వేయటం.. మిగిలిన ముస్లింలకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. తాజాగా జరుగుతున్న మారణహోమంలో కీలకభూమిక పోషిస్తున్న ముస్లిం ఉగ్రవాదుల కారణంగా.. ముస్లిం సమాజం మొత్తం వేలెత్తి చూపించే పరిస్థితి నెలకొంది. నిజానికి.. ముస్లింలు వేరు.. ఉగ్రవాదులు వేరన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషుల్లో మంచి.. చెడు ఎలానో.. అదే తీరులో ముస్లింలో ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన వారు ఉన్నట్లే.. ఆ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారు కోట్లాది మంది ఉన్నరన్న సత్యాన్ని మర్చిపోకూడదు.
అనుమానంగా చూస్తూ.. అవమానించటం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. ముస్లిం ఉగ్రవాదుల దుర్మార్గాల గురించి మీడియాలో వార్తలు వెల్లువలా వస్తున్న వేళ.. అదే ముస్లింలకు చెందిన కొందరి త్యాగాల గురించి వస్తున్న వార్తల్ని చూసినప్పుడు ఈ వ్యత్యాసం ఇట్టే అర్థమవుతుంది. బ్యాడ్ లక్ ఏమిటంటే.. చెడు మీద ఎంత త్వరగా చూపు పడుతుందో.. మంచి మీద పడదన్నట్లుగా.. ఉగ్రవాదం.. దాని దుర్మార్గం అందరిని భయపెడుతూ.. ముస్లింల మీద భయాందోళనలకు గురయ్యేలా చేస్తుంటే.. వారిలోని మంచి కోణం మాత్రంపెద్దగా బయటకు రావటం లేదు. మేం ఇప్పుడు అలాంటి మంచి కోణాల్ని.. అవసరమైతే తమ ప్రాణాల్ని సైతం త్యాగం చేయటానికి వెనుకాడని కొన్ని మంచి ఎగ్జాంఫుల్స్ ను పరిచయం చేయదలిచాం.
స్నేహం కోసం ప్రాణమే ఇచ్చేశాడు
సోషల్ మీడియాను ఊపేస్తున్న ఉదంతం ఇది. ఈ మధ్యకాలం ఒక వ్యక్తి గురించి.. అతడి త్యాగం గురించి సోషల్ మీడియా ఇంతగా స్పందించింది లేదు. వారూ.. వీరు అన్న తేడా లేకుండా మనసున్న ప్రతిఒక్కరూ ఫరాజ్ అయాజ్ హసన్ త్యాగాన్ని కీర్తిస్తున్నరు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రదాడి జరిగినప్పుడు బంధీలుగా తమ అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులు.. హసన్ ముస్లిం అని గుర్తించి అతన్ని వదిలేశారు. కానీ.. తనతో ఉన్న తరుషిజైన్.. మరో స్నేహితుడిని వదిలితే కానీ తాను వెళ్లనని తేల్చి చెప్పాడు. చివరకు కనికరం లేని ఉగ్రవాదులు హసన్ తో పాటు.. అతని ఇద్దరు స్నేహితుల్ని దారుణంగా చంపేశారు.
కోట్లు దొరికినా తీసుకోలేదు
సిరియా నుంచి జర్మనీకి అష్టకష్టాలు పడి చేరుకున్న లక్షలాది మందిలో ముహన్నాద్ ఒకడు. ఈ యువకుడికి జర్మన్ అధికారులు ఒక చిన్న నివాసాన్ని కేటాయించారు. తనకు దాతలు ఇచ్చిన సామాగ్రిని సర్దుకుంటుండగా.. అల్మారాలోని రహస్య సొరుగులో 50వేల యూరోలు లభించాయి. అదే అరలో బ్యాంకు పుస్తకాలు లభించాయి. వాటిల్లో లక్ష యూరోల వరకూ సొమ్ము ఉంది. ఈ మొత్తాన్ని సొంతం చేసుకుంటే.. అతడి జీవితానికి తిరుగు ఉండదు. హ్యాపీగా బతికేయొచ్చు. కానీ.. నిజాయితీని నమ్ముకోవటంతోపాటు.. పరుల సొమ్ము కోసం ఆశ పడకూడదని చెప్పిన ఇస్లాం మతారాచారన్ని పాటించి.. తనది కానీ డబ్బును అధికారులకు అప్పగించేశాడు.
ఐసిస్ అంతు చూడాలనుకుంటున్నాడు
బాహుబలిలో కాలకేయడి అమ్మ మొగుడులా ఉండే భారీకాయంతో చూస్తేనే వణుకు పుట్టించే.. ఈ ఇరానీ హెర్కులెస్ పేరు సాజిద్ ఘరీబీ. కాలకేయుడిలా దుర్మార్గుడు కాదు.. మంచి కాలకేయుడన్నమాట. 24 ఏళ్ల ఇతను చూసేందుకు దాదాపు హాలీవుడ్ మూవీలోని హల్క్ మాదిరి ఉంటాడు. ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్న ఐసిస్ అంటే ఒళ్లు మంట. వారు కనిపిస్తే తన్ని తగలేయాలని తెగ తపిస్తుంటాడు. ఇరాక్ ను ఆక్రమించుకున్న ఐసిస్ ను తరిమి కొట్టేందుకు ఇరాకీ సేనలు కిందామీదా పుడుతున్నాయి. వారికి సాయంగా ఉండేందుకు ఇతగాడు రంగంలోకి దిగాడు. తన దేశంలో శాంతి కోసం ఇరాక్ సైన్యంలో చేరి ఐసిస్ అంతు చూస్తానని చెబుతున్నాడు. 155 కేజీల బరువుండే ఈ బాడీబిల్డర్.. తన బరువుకు మించి 185 కేజీల వస్తువును దేనినైనా ఎత్తి అవతల పడేసే సామర్థ్యం అతని సొంతం. మరి.. ఇరాకీ సైన్యంలో చేరి ఐసిస్ అంతు చూడాలన్న అతని ఆశను అధికారులు ఆమోదిస్తారా? అన్నదే ఇప్పుడున్న ప్రశ్న.