Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్: ఒక్క పరీక్షతో అన్ని క్యాన్సర్ల గుట్టురట్టు

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:26 AM GMT
గేమ్ ఛేంజర్: ఒక్క పరీక్షతో అన్ని క్యాన్సర్ల గుట్టురట్టు
X
శాస్త్రసాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా.. ఇప్పటికి మనిషికి సవాలుగా నిలిచిన ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది.. ప్రమాదకరమైనది క్యాన్సర్. దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత మంచిది. బ్యాడ్ లక్ ఏమంటే.. కొన్ని క్యాన్సర్లు అయితే గుర్తించే పరీక్షలుఇప్పటివరకు లేవు. చేయి దాటిపోయిన తర్వాత తెలీటం.. ఏం చేయలేని పరిస్థితి పలువురికి.. పలు సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది. అలాంటి సమస్యలకు.. సవాళ్లకు చెక్ చెప్పే కొత్త ఆవిష్కరణ ఇప్పుడు బయటకు వచ్చింది.

ఒకే ఒక్క బ్లడ్ టెస్టుతో అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించే విధానాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టేశారు. ఎలాంటి లక్షణాలు కనిపించని క్యాన్సర్లను కూడా ఈ పరీక్షతో గుర్తించటం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. క్యాన్సర్ స్ర్రీనింగ్ లో ఈ కొత్త విధానాన్ని కనుగొనేందుకు గ్రెయిల్ అనే ఆరోగ్య సంస్థ ఈ సరికొత్త పరీక్షా విధానాన్ని డెవలప్ చేసింది. తమ అధ్యయనంలో భాగంగా ఈ సంస్థ దాదాపు 6662 మంది వ్యక్తులపై ఈ పరీక్షను నిర్వహించింది.

ఇలా ఎంపిక చేసిన వారంతా యాభై.. అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులే. షాకింగ్ నిజం ఏమంటే.. ఈ సరికొత్త పరీక్షను ఎంపిక చేసిన వారిలో పరీక్షిస్తే.. వారిలో ఒక శాతం మంది క్యాన్సర్లు ఉన్నట్లుగా గుర్తించారు.

ఈ పరీక్షకు ముందు వరకు చాలామందికి పరీక్షలు చేయగా.. క్యాన్సర్ కారకాల్ని గుర్తించటంలో విఫలం కావటం గమనార్హం. ప్యారిస్ లో ఇటీవల జరిగినయూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ అంకాలజీ కాంగ్రెస్ లో గ్రెయిల్ సంస్థ తమ రీసెర్చ్ వర్కును ప్రదర్శించింది.

తాజాగా కనుగొన్న పరీక్షా విధానంతో క్యాన్సర్ పరిశోధనల్ని సమూలంగా మార్చేసే విధానంగా భావిస్తున్నారు. ఈ కొత్త విధానంలో పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే వీలుందని.. లక్షణాలు కనిపించని క్యాన్సర్లను కూడా ముందుగా గుర్తించే సత్తా దీనికి ఉందని చెబుతున్నారు.

గాలెరీ పరీక్ష ద్వారా లివర్.. చిన్న పేగు.. యుటెరస్.. పాంక్రియాటిక్ స్టేజ్ 2.. బోన్ క్యాన్సర్ లాంటివాటిని లక్షణాలు లేకున్నా గుర్తించే సత్తా ఉందంటున్నారు. ఈ పరీక్షలో 97 వాతం కచ్చితత్వం ఉందని చెబుతున్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించటంతో చికిత్సను మరింత వేగంగా చేయటం ద్వారా.. ప్రాణాల్ని కాపాడే వీలుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.