Begin typing your search above and press return to search.

అందరి కళ్ళు చంద్రబాబు పైనే

By:  Tupaki Desk   |   25 Jun 2021 1:30 PM GMT
అందరి కళ్ళు చంద్రబాబు పైనే
X
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేయాలని చంద్రబాబునాయుడు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. 175 నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలు నిరసన దీక్షల్లో పాల్గొంటారని చంద్రబాబు చెప్పటం వరకు బాగానే ఉంది. అయితే మరి నిరసన దీక్షల విషయంలో చంద్రబాబునాయుడు ఆయన పుత్రరత్నం నారా లోకేష్ ఏమి చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా గడచిన ఏడాదికిపైగా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఎంతో అవసరమైనపుడు లేదా అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే విజయవాడకు వస్తున్నారు. గడచిన ఏడాదిలో చంద్రబాబు కుప్పంకు వెళ్ళింది రెండుసార్లు మాత్రమే. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీచేసిన లోకేష్ తర్వాత ఒక్కసారి మాత్రమే పోటీచేసిన నియోజకవర్గంలో పర్యటించారు. కాకపోతే వేర్వేరు కారణాల రీత్యా.. అనేక జిల్లాల్లో పర్యటించాడు. మొన్న టీడీపీ హత్యల నేపథ్యంలో కర్నూలు వచ్చారు. కానీ ప్రత్యేకండా నియోజకవర్గాలకు పెద్దగా తిరగలేదు.

గతంలో కూడా ప్రభుత్వ విధానాలకు నిరసనలు తెలిపారు. అయితే అవన్నీ ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చోవటం. కాబట్టి చంద్రబాబు ఎక్కడ కూర్చుంటారనే విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇపుడు కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. నేతలందరు స్వేచ్చగా రోడ్లపైకి వచ్చేయొచ్చు. అందుకనే 29వ తేదీన నిరసనలకు పిలుపినిచ్చారు.

మరి 175 నియోజకవర్గాల్లో నేతల నిరసన దీక్షలు చేయబోతున్నపుడు చంద్రబాబు కుప్పంలోను, లోకేష్ మంగళగిరిలోను దీక్షల్లో పాల్గొనాలి కదా. మరి వీళ్ళిద్దరు పై రెండు నియోజకవర్గాలకు వెళతారా ? లేకపోతే హైదరాబాద్ ఇంట్లోనే కూర్చుని జూమ్ యాప్ లో నిరసనల్లో పాల్గొంటారా ? అన్నది చూడాలి.