Begin typing your search above and press return to search.
అందరి కళ్లు ఈ అన్నాచెల్లి మీదనే!
By: Tupaki Desk | 22 Aug 2021 10:41 AM ISTఏదైనా పర్వదినాన రాజకీయాల్ని కాసేపు వదిలేస్తారు. ఆ గోల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు రాజకీయ నేతలు. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఇప్పుడు పర్వదినమే రాజకీయంగా ఏం జరుగుతుందన్న ఆసక్తిని వ్యక్తం చేస్తోంది. ఇవాల్టి రోజున రక్షాబంధన్ అన్న సంగతి తెలిసిందే. ఉత్తరాదిన బాగా చేసే ఈ పండుగ.. గడిచిన ఇరవై ఏళ్లలో తెలుగువారిని బాగా పట్టేసింది. కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన అన్నాచెల్లెళ్ల భోజనాలు (దీపావళి వెళ్లిన రెండో రోజున) పెద్దగా ఎక్కదు కానీ.. ఉత్తరాది వారి రాఖీ మాత్రం తెలుగువారంతా సొంతం చేసుకున్నారు. ఈ రాఖీ వేళ.. మిగిలిన వారి సంగతులు ఎలా ఉన్నా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి షర్మిలకు సంబంధించి ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
ఇద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో ఎవరికి వారుగా ఉంటున్నారని.. అన్నతో తేడా వచ్చేసి.. తెలంగాణకు వచ్చేయటమే కాదు.. సొంతంగా పార్టీ పెట్టేసిన షర్మిల.. తన ఉనికిని ప్రదర్శించేందుకు తీవ్రంగా తపిస్తున్నారు. జగన్ అభీష్టానికి భిన్నంగా పార్టీ పెట్టినట్లుగా షర్మిల గురించి చెబుతారు. ఈ విషయాన్ని జగన్ సన్నిహితులు ఇప్పటికే ఆ విషయాన్ని చెప్పేశారని చెప్పాలి. జగన్ మీద నేరుగా వ్యాఖ్యలు చేయని షర్మిల.. ఆయన మీడియా సంస్థ మీద మాత్రం సెటైర్లు వేయటం తెలిసిందే.
ఈ అన్నా చెల్లెళ్లు తమ మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో రక్షా బంధన్ రోజున కలుస్తారా? ఎవరికి వారుగా ఉంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వైఎస్ కుటుంబంలో మిగిలిన పండుగలు ఎలా ఉన్నా.. వైఎస్ పుట్టినరోజును.. క్రిస్ మస్ ను.. రాఖీ పండుక్కి అంతా కలిసి చేసుకోవటం వారి కుటుంబానికో అలవాటు. తన అన్న అభీష్టానికి భిన్నంగా తెలంగాణలో పార్టీ పెట్టిన విషయాన్ని షర్మిల ఇప్పటికే చెప్పారు.
తన అన్నకు ఇష్టం లేకుండా పార్టీ పెట్టినంత మాత్రాన తనకు ఆయన అన్న కాకుండా పోడని.. రాఖీ రోజున అన్నకు రాఖీ కడుతానని ఆమె చెప్పారు. అయితే.. గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. గత నెల (జులై 8న) వైఎస్ జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ సమాధి వద్దకు ఇద్దరు కలిసే వెళతారని అనుకున్నారు. కానీ.. అదే రోజు పార్టీ పెట్టే షెడ్యూల్ ఉండటంతో ఉదయాన్నే వెళ్లి నివాళులు అర్పించిన షర్మిల హైదరాబాద్ కు వచ్చేశారు.
తన చెల్లి షెడ్యూల్ టైంకు జగన్ వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. కానీ.. వెళ్లలేదన్న మాట వినిపిస్తుంది. తన చెల్లి షెడ్యూల్ కు అనుగుణంగా తాను టైం మార్చుకున్నారని చెబుతారు. షర్మిల పార్టీ పెట్టిన రోజున.. ఆమె తల్లి విజయమ్మ మాట్లాడుతూ.. తన పిల్లలు ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండటం దైవ నిర్ణయమేమో అని తన మనసులోని మాటను చెప్పారు. అన్నతో విభేదాలు బయటకు వచ్చిన మొదటి రాఖీ పండుగగా చెప్పాలి. మరి.. రాజకీయం వేరు వ్యక్తిగతం వేరన్న దానికి విలువను ఇచ్చి షర్మిల తన అన్నకు రాఖీ కట్టేందుకు వెళతారా? లేదంటే వెళ్లకుండా ఉంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. షర్మిల రాఖీ కట్టినా.. రాఖీ కట్టకున్నా.. రాజకీయంగా మాత్రం ఏదో ఒక విశ్లేషణ మాత్రం ఖాయమని చెప్పక తప్పదు.