Begin typing your search above and press return to search.

దోవ‌ల్ చైనా టూర్‌..ఆ దేశానికే ఎక్కువ క్రేజ్‌

By:  Tupaki Desk   |   25 July 2017 3:56 PM GMT
దోవ‌ల్ చైనా టూర్‌..ఆ దేశానికే ఎక్కువ క్రేజ్‌
X
అజిత్ దోవల్...భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి స‌న్నిహితుడనే పేరుంది. విదేశాల‌కు సంబంధించిన దౌత్య‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో - శాంతి భ‌ద్ర‌త‌ల అంశంలో దోవ‌ల్ పాత్ర‌ క్రియ‌శీలం. అలాంటి దోవ‌ల్ ఈ నెల 27 - 28 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశంలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్తున్నారు. ఈ సమావేనికి చైనా జాతీయ భద్రతా సలహాదారు - స్టేట్ కౌన్సిలర్ యంగ్ జీయిచి ఆతిథ్యమిస్తున్నారు. అజిత్ దోవల్ ప‌ర్య‌ట‌న‌పై మ‌న‌దేశం కంటే చైనీయులే ఎక్కువ‌గ‌వా ఆస‌క్తితో ఉన్నార‌ని స‌మాచారం. డోకలామ్ వద్ద ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడేందుకు దోవల్ కృషి చేయగలరని భావిస్తున్నారు.

బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్ - రష్యా - ఇండియా - చైనా - సౌతాఫ్రికా అధికారుల సమావేశాల్లో భాగంగా ఈ సదస్సు జరుగుతోంది. జియామెన్ నగరంలో సెప్టెంబరులో జరిగే ఈ దేశాల అధినేతల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా రిఫార్మ్ ఫోరం ప్రతినిధి మా జియాలి అభిప్రాయాలను చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. అజిత్ దోవల్ బీజింగ్ పర్యటన చాలా కీలకమైనదని బియాలి పేర్కొన్నట్లు తెలిపింది. భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడినట్లు తెలిపింది. సరిహద్దు వివాదాలపై చర్చల్లో దోవల్ - యాంగ్ ఇరు దేశాలకు ప్రత్యేక ప్రతినిథులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయి. సిక్కిం సెక్టర్‌ లోని డోకలామ్ వద్ద ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు దోవల్ - యాంగ్ చర్చలు జరుపుతారని చైనా అధికారులు తెలిపారు.