Begin typing your search above and press return to search.

ఆల్ ఫ్రీ.. ఫొటో వైరల్

By:  Tupaki Desk   |   13 March 2021 10:30 AM GMT
ఆల్ ఫ్రీ.. ఫొటో వైరల్
X
ఒక అందుకు చూస్తే.. ప్రధాని నరేంద్రమోడీ బెటర్ అనిపిస్తాడు. ఎందుకంటే ఆయన దేశంలోని మిగతా రాజకీయ పార్టీలలాగా ఉచిత పథకాలు ప్రవేశపెట్టరు. దానికి దూరంగా ఉంటారు. పరిశ్రమలు పెట్టి.. ఉపాధి కల్పిస్తారు. తద్వారా ఎవరి కష్టం వారు చేసుకోమని బాగుపడమంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే రేషన్ నుంచి అన్నీ ఫ్రీం అంటూ ప్రజలను సోమరి పోతుల్లా మార్చేస్తున్నారన్న విమర్శ ఉంది. కష్టం చేయకుండా ఏదైనా అవయవ లోపం ఉందని సర్టిఫికెట్ తీసుకుంటే చాలు నెలకు వికలాంగ పింఛన్ కింద రూ.3వేలతో బతికేలాగా ప్రజలను మార్చేశారన్న విమర్శ వినిపిస్తోంది.

ఇక తమిళనాడులో అయితే మరీ ఘోరం.. అక్కడ ప్రజలకు ఉచితాల పేరిట కుమ్మరిస్తారు. సైకిల్ నుంచి బైక్ దాకా.. పప్పూ బెల్లాల నుంచి పక్కపిన్నీసుల దాకా.. ఇండ్లు, నెలకు 10వేలు, టీవీలు, ఇంట్లోని సామగ్రి, వైఫై, ఏది కావాలంటే అది ఉచితంగా ఇస్తామని హామీలు ఇస్తూ ప్రజలను మరీ పనిచేయనివ్వకుండా బురిడీ కొట్టించి అధికారంలోకి వస్తారు. కొన్ని అమలు చేస్తారు. మరికొన్ని చేయరు. ప్రజలను అయితే సోమరులుగా మార్చేస్తుంటారనే విమర్శలున్నాయి.

అయితే ఈ ఉచితాలపై కడుపు మండిన ఓ వృద్ధుడు రోడ్డుమీదకొచ్చాడు. తన అక్కసునంత వెళ్లగక్కేలా మెడలో ఓ పోస్టర్ తగిలించుకొని వినూత్న నిరసన తెలిపాడు. ఆ వృద్ధుడు చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వాల అసమర్థతను చాటిచెబుతోంది.

‘తిండి, ఇల్లు అన్ని ఫ్రీ. పనిలేకున్నా పదివేల జీతం. మా పార్టీకే ఓటెయ్యండి.. పార్టీ గుర్తు :‘చెవిలో పువ్వు’’ అంటూ వృద్ధుడు ఓ పోస్టర్ ను మెడకు తగిలించుకొని వినూత్న నిరసన తెలిపాడు. ‘ఓటు వేయండి-పువ్వు చెవిలో పెట్టుకోండి’ అని క్యాప్షన్ ఇచ్చి దీన్నిప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ప్రభుత్వాల ‘ఉచితాల’ పరంపరను కడిగిపారేస్తున్నారు.