Begin typing your search above and press return to search.
కొత్త రచ్చ.. రాహుల్ పై ఆకాశవాణి!
By: Tupaki Desk | 3 Sep 2016 5:04 AM GMTరాజకీయ పార్టీల నాయకులంటే రకరకాలుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ.. ఒక అధికారిక ప్రసార మాధ్యమం అధికారపక్షానికి సానుకూలంగా ఉన్నట్లు.. ప్రతిపక్ష నాయకుడిపై వ్యాఖ్యలు చేయడం మాత్రం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరిగిఉండకపోవచ్చు. ప్రైవేటు మీడియా సంస్థలు ఎలా ప్రవర్తించినా పెద్దగా స్పందించేవారు ఉండకపోవచ్చు కానీ.. అధికారిక మీడియా ఇలా స్పందించే సరికి పెద్ద దుమారమే లేచింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వేసిన పరువు నష్టం దావాపై విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే.. కేసు కూడా కొట్టేయాలని సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా రేడియో కాస్త వెటకారంగా ట్వీట్ చేసింది. "రాహుల్ ముందు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు విచారణ ఎదుర్కొనే ధైర్యం ఎలా వచ్చింది? రాహుల్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి!" అని ఆల్ ఇండియా రేడియో ట్వీట్ చేసింది.
దీంతో కాంగ్రెస్ వర్గాలు ఆల్ ఇండియా రేడియో చేసిన ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అయితే వరుస ట్వీట్లతో మండిపడ్డారు. ఒక అధికారిక ప్రసార మాధ్యమం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఏమాత్రం క్షమించరాని చర్య అని ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేయమని సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి ఆర్‌ఎస్‌ఎస్ ఆర్డర్స్ పాస్ చేసిందా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించింది ఆల్ ఇండియా రేడియో.